Emergency Movie : కంగనా రనౌత్ కు బిగ్ రిలీఫ్..'ఎమర్జెన్సీ' రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్.. కానీ ?

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎమెర్జెన్సీ' సినిమా విడుదలకు సెన్సార్ యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎగ్జామినింగ్ కమిటీ సినిమాకు 'UA' సర్టిఫికేషన్ ఇస్తూ పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది.

New Update
Emergency Movie : కంగనా రనౌత్ కు బిగ్ రిలీఫ్..'ఎమర్జెన్సీ' రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్.. కానీ ?

Emergency Movie : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎమెర్జెన్సీ' సినిమా విడుదలకు సెన్సార్ యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎగ్జామినింగ్ కమిటీ సినిమాకు 'UA' సర్టిఫికేషన్ ఇస్తూ పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా సీన్స్‌ను తొలగించడమో వాటి స్థానంలో కొత్తవి జోడించడమో చేయాలని చిత్ర బృందానికి సూచించింది.

Also Read : ‘ఇండియన్ 2’ ప్లాప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్

బంగ్లాదేశ్‌ శరణార్థులపై పాకిస్థాన్‌ సైనికులు దాడి చేయడం, ఓ చిన్నారిని, ముగ్గురు మహిళలను శిరచ్ఛేదం చేయడం వంటి సన్నివేశాలను మార్చాలని చెప్పింది. భారత మహిళలను కించపరిచేలా నిక్సన్‌ పాత్ర చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, బంగ్లాదేశ్‌ శరణార్థులు, కోర్టు తీర్పుల సమాచారం ఎక్కడిది? ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’ ఫుటేజీ అనుమతికి సంబంధించి కొన్ని వివరాలు కోరింది. ఇక సినిమాకు సెన్సార్ నుంచి పర్మిషన్ రావడంతో చిత్ర నిర్మాతలు త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు