Telangana Voters: తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల.. మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి.. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర తుదిఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493గా ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339 కాగా ట్రాన్స్ జండర్ ఓటర్లు 2557 మంది ఉన్నారు. By Shiva.K 04 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Voters List Released: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర తుదిఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493గా ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339 కాగా ట్రాన్స్ జండర్ ఓటర్లు 2557 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేసిన ఎన్నికల సంఘం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. తుది జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా 3,17,17,389 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,58,71,493 మంది పురుషులు, 1,58,43,339 మంది స్త్రీ ఓటర్లు ఉంటారు. ఇక 2,557 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. 15,338 సర్వీస్ ఎలక్టర్లు, 2,780 ఓవర్సీస్ ఎలక్టర్లు ఉన్నారు. జనవరి 2023 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఓటర్ల సంఖ్య 5.8 శాతం పెరిగింది. తుది జాబితాలో సెప్టెంబర్ 19, 2023కి ముందు స్వీకరించిన దరఖాస్తులను అంగీకరించడం జరిగింది. రోల్ ముసాయిదా ప్రచురణ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు 17,01,087 కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. సెప్టెంబర్ 19, 2023కి ముందు స్వీకరించిన 7,617 దరఖాస్తులను పరిష్కరించింది ఎన్నికల కమిషన్. ఇక ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి కూడా మెరుగుదల కనిపించింది. 992 నుంచి 998కి పెరిగింది. ఇక 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో లింగ నిష్పత్తి 707 నుంచి 743కి పెరిగింది. 80 ఏళ్లు పైబడిన 43,943 మంది ఓటర్లకు, 5,06,493 మంది దివ్యాంగులకు, థర్డ్ జెండర్ల సంఖ్య 2,557కి పెరిగింది. అయితే, తుది జాబితా ప్రకటించినప్పటికీ.. ఓట్ల జాబితాను ఆధునీకరించే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. అర్హులైన వ్యక్తులందరూ అంటే 1.10.2023 నాటికి 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కు ఎన్‌రోల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటర్లు eci.gov.in కి లాగిన్ అయి లేదా ఓటర్ల హెల్ప్‌లైన్ యాప్(VHA) ద్వారా గానీ తమ ఓటుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ వివరాలలో ఏవైనా పొరపాట్లు ఉంటే.. ఓటర్లు ఫారమ్ 8ని ఉపయోగించి ఆన్‌లైన్ లేదా VHA లేదా BLO ద్వారా దిద్దుబాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా ప్రక్షాళన.. కాగా, ఈ తుది జాబితా నాటికి మొత్తం 22,02,168 మంది చనిపోయిన, డూప్లికేట్, బదిలీ అయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఈ ఓటర్లలో 4,89,574 మంది జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు చెందిన వారు. ఈ ఏడాది 2,47,756 మంది చనిపోయిన ఓటర్లను కూడా ఓటర్ల జాబితాను నుంచి తొలగించడం జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. The full Election Commission reviewed the election preparedness at ground level with District Collectors and SPs and Police commissioners of #Telangana. pic.twitter.com/RBOhRv2Kd2 — All India Radio News (@airnewsalerts) October 4, 2023 Click Here To Search Your Name in Voter List Also Read: Central Cabinet Decisions: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు.. ఎట్టకేలకు కృష్ణా జలాలపై స్పందన.. Chandrababu case: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది? #telangana-news #telangana-elections #telangana-politics #central-election-commission #telangana-voters-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి