Telangana : తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌ పై కేసు నమోదు!

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది.ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో రూ. 1000 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

New Update
Telangana : తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌ పై కేసు నమోదు!

Case On Ex CS Somesh : తెలంగాణ (Telangana) లో వాణిజ్య పన్నుల శాఖ (Commercial Taxes Department) లో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది. ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో సుమారు రూ. 1000 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ లో వెల్లడైంది.

కమర్షియల్‌ టాక్స్‌ కమిషనర్‌ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం బయటకు వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ (Somesh Kumar) తో పాటు పలువురి పై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కమర్షియల్‌ టాక్స్‌ అడిషనల్‌ కమిషనర్‌ , డిప్యూటీ కమిషన్లర పై కేసు నమోదు అయ్యింది. నిందితులపై 406, 409, 120 (బి) ఐటీ చట్టం కింద సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Also read: అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి!


Advertisment
Advertisment
తాజా కథనాలు