CBSE Exams: సీబీఎస్‌ఈ స్టూడెంట్స్‌ కు అలర్ట్‌...పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు!

సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి ఓ కీలక అప్‌ డేట్‌ ను బోర్డు విడుదల చేసింది. ఇంతకు ముందు విడుదల చేసిన పదో తరగతి, 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ లో మార్పులు చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ను కూడా బోర్డు విడుదల చేసింది

New Update
Board Exam Diet Tips: బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయ్..పేరెంట్స్..మీ పిల్లలు ఫిట్‎గా ఉండేందుకు ఈఫుడ్స్ ఇవ్వాల్సిందే.!

CBSE Exams: సీబీఎస్‌ఈ విద్యార్థులకు సంబంధించి ఓ కీలక అప్‌ డేట్‌ ను బోర్డు విడుదల చేసింది. ఇంతకు ముందు విడుదల చేసిన పదో తరగతి, 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ లో (Exams Reschedule) మార్పులు చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ను కూడా బోర్డు విడుదల చేసింది.

ఇంతకు ముందు ప్రకటించిన పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ లో ఏమేం మార్పులు  జరిగాయంటే..ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్‌ పేపర్‌ ను ఫిబ్రవరి 28 న విద్యార్థులు రాయాల్సి ఉంది. దీనితో పాటు మార్చి 4న జరగాల్సిన టిబెటన్‌ ఎగ్జామ్‌ ను ఫిబ్రవరి 23 కి మార్చగా, మార్చి 5 న జరగాల్సిన ఫ్రెంచ్‌ పరీక్షను ఫిబ్రవరి 20 కి చేంజ్‌ చేశారు.

ఇక 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ లో ఒకే ఒక్క మార్పు చేశారు. ఫ్యాషన్‌ స్టడీస్‌ సబ్జెక్టు పరీక్ష మార్చి 11న జరగాల్సి ఉండగా..మార్చి 21కి మార్చారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12 వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి.

అన్ని పరీక్షలు కూడా రోజూ ఉదయం 10.30 గంటలకు మొదలవుతాయని బోర్డు (CBSE) వివరించింది. జేఈఈ మెయిన్‌ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పరీక్షకు మధ్య గ్యాప్‌ ఇవ్వడం జరిగిందని బోర్ఢు అధికారులు వివరించారు.

Also read: గోదావరి జిల్లాలపై ప్రధాన పార్టీలు ఫోకస్..

Advertisment
Advertisment
తాజా కథనాలు