Ayesha Meera Case: అయేషా మీరా హత్య కేసు సాక్షులను విచారించిన సీబీఐ అధికారులు

విజయవాడలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సాక్షులను సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ ఏఎస్పీ సీఆర్‌ దాస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ విచారణ చేపట్టింది. అయేషా మృతదేహనికి పంచనామా చేసినప్పుడు అక్కడే ఉన్న కృష్ణప్రసాద్‌, లాయర్ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు.

New Update
Ayesha Meera Case: అయేషా మీరా హత్య కేసు సాక్షులను విచారించిన సీబీఐ అధికారులు

Ayesha Meera Case: 16 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సాక్షులను సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ ఏఎస్పీ సీఆర్‌ దాస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ విచారణ చేపట్టింది. అయేషా మృతదేహనికి పంచనామా చేసినప్పుడు అక్కడే ఉన్న కృష్ణప్రసాద్‌, లాయర్ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు.

న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం..

విచారణ అనంతరం అయేషా కేసు తరపు న్యాయవాది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కేసు పురోగతి వేగవంతం చేయాలని అడిగామని అధికారులను అడిగామని తెలిపారు.
ఇన్ని సంవత్సరాలు విచారణ జరగాల్సిన కేసు కాదన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న కేసు కావడంతో విచారణ ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. అయేషా కుటుంబసభ్యులకు న్యాయం చేసి , నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. అయేషా మీరా అస్తికలు కుటుంబసభ్యులకు ఇవ్వాలని కోర్టు చెప్పిందని.. ఇవ్వాలని అడగ్గా.. కేసులో అవే కీలకం కావడంతో ఇవ్వడం సాధ్యం కాదని సీబీఐ అధికారులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

నిందితులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాం..

అయేషా మృతదేహనికి పంచనామా రాసే సమయంలో తాను అక్కడే ఉన్నానని సాక్షి కృష్ణప్రసాద్‌ తెలిపారు. నాడు విచారణలో ఏయే అంశాలు చెప్పానో అవే అంశాలు మళ్లీ చెప్పానని పేర్కొన్నారు. ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని.. 16 సంవత్సరాలైన కేసు కొలిక్కి రాలేదన్నారు. కేసు విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. పోలీసులు ఛార్జ్‌షీట్‌లో కృష్ణప్రసాద్ పేరును దాఖలు చేయడంతో ఆయనను సీబీఐ అధికారులు విచారించారు.

సత్యంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు..

2007వ సంవత్సరం డిసెంబర్ 27న విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని దుర్గా లేడీస్ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యకు గురైంది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరిగాయి. అప్పుడు అయేషా విజయవాడలోని నిమ్రా కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్ చదువుతోంది. ఆమె హత్య తర్వాత హాస్టల్‌లో ఉంటున్న వారిని, వార్డెన్‌, స్నేహితులను పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 56 మంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత సత్యంబాబును పోలీసులు అరెస్టు చేశారు. అయితే 2017లో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించడంతో అసలు నిందితులను పట్టుకునే పనిలో సీబీఐ నిమగ్నమైంది.

2018 డిసెంబరులో ఈ కేసు విచారణను సీబీఐ స్వీకరించింది. విచారణలో భాగంగా అయేషా తల్లిదండ్రులను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్‌ఏ టెస్ట్ కూడా చేయించారు. వారి వద్ద ఉన్న వివరాలను సేకరించారు. కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్‌మార్టం కూడా నిర్వహించారు.

ఇది కూడా చదవండి: నన్ను అరెస్ట్ చేస్తారు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు