Somi Reddy : వీడియోలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత సోమిరెడ్డి

AP: టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు అయింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లె గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్ కావడంతో సోమిరెడ్డిపై పొదలకూరు పీఎస్‌లో కేసు నమోదు అయింది

New Update
Somi Reddy : వీడియోలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత సోమిరెడ్డి

TDP Leader Somi Reddy : టీడీపీ (TDP) సీనియర్‌ నేత సోమిరెడ్డి (Somi Reddy) పై కేసు నమోదు అయింది. ఓటర్లకు (Voters) డబ్బులు పంచుతూ సోమిరెడ్డి దొరికిపోయాడు. సోమిరెడ్డి డబ్బులు పంచుతున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లె గ్రామంలో చంద్రమోహన్‌రెడ్డి, ఆయన కొడుకు రాజగోపాల్‌రెడ్డి డబ్బు పంపిణీ చేశారు. పంపిణీ సమయంలో ఓ కార్యకర్త వీడియో తీశాడు. ఈ నేపథ్యంలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్‌ (Viral Video) అయింది. పొదలకూరు పీఎస్‌లో సోమిరెడ్డిపై కేసు నమోదు అయింది.

Also Read : తెలంగాణ కొత్త చిహ్నంపై సీఎం రేవంత్ సమీక్ష

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!

IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు.

New Update

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్‌ ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. బూత్‌ లెవల్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల తరపున పోరాటాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలన్నారు. ఇంకా సమయం ఉందని వేచి చూసే ధోరణి వద్దని హెచ్చరించారు. విశాఖలో రూ.3 వేల కోట్ల భూమిని చంద్రబాబు సర్కార్ ఊరు, పేరు లేని కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. లులూ గ్రూప్‌కు రూ.2 వేల కోట్ల భూమిని కట్టబెట్టారన్నారు. రాజధానిలో నిర్మాణ పనుల అంచనాలను పెంచేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. 

దిగజారిన వ్యవస్థలు..

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని ఈ సమావేశంలో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. IPS ఆంజనేయులు అరెస్ట్ ఈ పరాకాష్టకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెట్టుకొని ఎలాగైనా మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నాడని ఆరోపించారు.

(ys-jagan | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment