Kadapa: ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు!

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. మహిళా కౌన్సిలర్ వెంకట లక్ష్మీని ఇంటికెళ్లి బెదిరించిన ఇష్యూలో కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

New Update
Kadapa: ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు!

Case Filed Against Rachamallu: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుకు పోలీసులు షాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీ మహిళా కౌన్సిలర్ ను బెదిరించిన ఇష్యూలో కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి రాలేదనే కోపంతో ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు పలు సాక్ష్యాల ఆధారంగా గురువారం కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు.

మహిళా కౌన్సిలర్ కు బెదిరింపులు..
ఈ మేరకు ప్రొద్దుటూరు (Proddatur) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి.. ఫిబ్రవరి 19న వైసీపీ మహిళా కౌన్సిలర్ అయిన వెంకట లక్ష్మీని ఇంటికెళ్లి బెదిరించినట్లు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారానికి రాలేదనే కక్షతో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తన భర్త రామాంజనేయులు కాళ్లు విరిచేస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్లు వాపోయింది. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ పిబ్రవరి 21న ఎస్పీకి, ఎన్నికల కమిషన్ కు కౌన్సిలర్ దంపతులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: DSC: టెట్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. టి-సాట్ లో ఫ్రీ క్లాసులు!

ఈ క్రమంలో బుధవారం కౌన్సిలర్ వెంకటలక్ష్మి దంపతులను విచారించినట్లు చెప్పిన ఆర్వో కౌసర్ బానూ, డీఎస్పీ మురళీధర్.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెల రోజుల తర్వాత ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు