నీ మొఖానికి ఒక్కటన్న నిజం చెప్పావా..!

ఏపీలో అబద్దాల నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు మాత్రమే అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ అధినేతపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో.. దేశంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ కాకాణి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇంత అబద్ధాల నాయకుని నేనెక్కడ చూడలేదు అంటూ మండిపడ్డారు.

New Update
నీ మొఖానికి ఒక్కటన్న నిజం చెప్పావా..!

Caraf for liars is Chandrababe

అన్ని అబద్ధాలే..

టీడీపీ అధినేతపై ఫైర్‌ అయ్యారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి అబద్ధానికి షర్టు, ప్యాంటు వేస్తే చంద్రబాబులా ఉంటుందని విమర్శించారు. చంద్రబాబు జీవితం అబద్ధాలమయం.. జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పని వ్యక్తి చంద్రబాబు.. ప్రపంచంలో ఏ మంచి జరిగినా అన్ని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటు.. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టాను కాబట్టి సత్య నాదేళ్ల సీఈవోగా ఎదిగారని చంద్రబాబు చెప్పారు. ఇంతకన్నా పచ్చి అబద్ధం వేరేది ఉందా? 1992లోనే మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల చేరారు. అప్పటికి ఇంకా చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కాలేదు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు రాలేదు. ఇది అందరికీ తెలిసినా.. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మాత్రం ఆగడంటూ మండిపడ్డారు.

చార్జిషీట్‌ వేయడానికి అర్హత ఉందా..

ఏమి జరిగినా అంతా తనవల్లే అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు అని సెటైర్లు వేశారు మంత్రి. దేశంలో జాతీయ రహదారులు వేసే విషయం కూడా తానే వాజ్‌పేయ్‌కు చెప్పానని కూడా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట్లాడిన విషయం చూస్తే ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో తెలుస్తుందని.. చంద్రబాబు లాగా ఇంగ్లీష్ మాట్లాడితే మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారా..? మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ఇంగ్లీష్ మీడియంను జగన్ తీసుకొస్తే దానిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మీద చార్జిషీట్‌ వేయడానికి టీడీపీ నేతలకు ఏం అర్హత ఉందని కాకాణి నిలదీశారు.

మా అభివృద్ధిని దాచలేదు

టీడీపీ నేతల లాగా మేనిఫెస్టోను దాచలేదు. ఇంటర్నెట్ నుంచి తొలగించలేదు.. మేనిఫెస్టోను చేతిలో పట్టుకుని ఇంటింటికి వెళ్లి ఏ ఏ పథకాలు వచ్చాయి అనే విషయాన్ని ఆరా తీస్తున్నాం అని వివరించారు. చంద్రబాబు ఏ రోజైనా మేనిఫెస్టోకు సంబంధించి మాట్లాడారా? 650 వాగ్దానాలు ఇచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కానీ, మేం నవరత్నాలు ఇస్తామని చెప్పి అన్నీ అమలు చేస్తున్నాం.. టీడీపీ నేతలు కోరుకున్న గ్రామానికి వెళదాం.. కుప్పం లేదా టెక్కలికి వెళ్లి చూద్దాం.. టీడీపీ మేనిఫెస్టో.. వైసీపీ మేనిఫెస్టో ఏవిధంగా అమలైందో చూద్దాం అంటూ సవాల్‌ చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఛాలెంజ్‌ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు