AP News: రెబల్స్ అభ్యర్థులకు టీడీపీ షాక్.. పార్టీ నుంచి సస్పెండ్! ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ రెబల్స్ గా నామినేషన్లు వేసిన అభ్యర్థులను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సివేరి అబ్రహం, మీసాల గీత, శ్యాం కుమార్, సూర్యచంద్రరావు, శివరామరాజుతోపాటు తదితరులపై సస్పెన్షన్ వేటు వేసింది. By srinivas 29 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి AP TDP: టీడీపీ రెబల్స్ గా నామినేషన్లు వేసిన అభ్యర్థులను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన శ్యాం కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, నియోజకవర్గానికి చెందిన శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డ రాజశేఖర్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెబుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇది కూడా చదవండి: Osmania University: ఓయూలో కరెంట్, తాగునీటి కొరత.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన! నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో.. ఇక అధిష్టానం సిటీ ఇవ్వకపోవడంతో ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన పలువురు టీడీపీ నేతలు. అయితే ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. వీరంతా వెనక్కు తీసుకుంటారని భావించింది. అయితే ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ఆయా అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు వేసింది. #ap-tdp #suspended #rebels మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి