Calcium Food: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా..అయితే ప్రతిరోజూ ఆహారంలో ఈ రెండింటిని చేర్చుకోండి!

శరీరంలో కాల్షియం లోపాన్ని తీర్చడానికి గసగసాలు ఉపయోగించండి. గసగసాలు ఇనుము, కాల్షియం వంటి ఖనిజాల నిల్వ. ఇందులో రాగి, జింక్ కూడా ఉంటాయి. ఈ మినరల్స్ అన్నీ ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా గసగసాలు సహకరిస్తాయి.

New Update
Calcium Food: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా..అయితే ప్రతిరోజూ ఆహారంలో ఈ రెండింటిని చేర్చుకోండి!

ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోపం పెరుగుతోంది. మార్కెట్‌లో లభించే ప్యాక్‌డ్‌ మిల్క్‌ వల్ల శరీరానికి అన్ని పోషకాలు సరిగా అందవు. అటువంటి పరిస్థితిలో, శరీరంలో కాల్షియం లోపం ఉండవచ్చు. కాల్షియం లోపం వల్ల ఎముకలు, దంతాలు బలహీనమవుతాయి. కాల్షియం పరిమాణం చాలా తగ్గినప్పుడు, ఒత్తిడి, నిరాశ కూడా సంభవించవచ్చు.

కాల్షియం లోపం వల్ల జుట్టు పొడిబారుతుంది. గోళ్లు, ఎముకలు బలహీనపడతాయి. కొంతమందికి కాళ్లు, నడుములలో తీవ్రమైన నొప్పి, కండరాల తిమ్మిరి, అలసట కూడా ఉంటాయి. కాల్షియం లోపాన్ని అధిగమించడానికి చాలా మంది పాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే శరీరంలో కాల్షియం లోపాన్ని తీర్చగల 2 విత్తనాల గురించి తెలుసుకుందాం.

కాల్షియం అధికంగా ఉండే విత్తనాలు

గసగసాలు - శరీరంలో కాల్షియం లోపాన్ని తీర్చడానికి గసగసాలు ఉపయోగించండి. గసగసాలు ఇనుము, కాల్షియం వంటి ఖనిజాల నిల్వ. ఇందులో రాగి, జింక్ కూడా ఉంటాయి. ఈ మినరల్స్ అన్నీ ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా గసగసాలు సహకరిస్తాయి. మీరు ఫైబర్ అధికంగా ఉండే గసగసాలను పాలలో నానబెట్టడం ద్వారా కూడా తినవచ్చు.

సబ్జా గింజలు- వైద్యులు కూడా ఆహారంలో సబ్జా గింజలను చేర్చుకోవాలని సలహా ఇస్తారు. బరువు తగ్గడానికి ప్రసిద్ధి చెందిన సబ్జాలు విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్నాయి. మీరు ప్రతిరోజూ 1-2 చెంచాల సబ్జా గింజలను నీటిలో కలిసి తీసుకుంటే.. సుమారు 180 mg కాల్షియం శరీరానికి అందుబాటులో ఉంటుంది. కాల్షియం కాకుండా, సబ్జా లలో ఒమేగా -3 , ఫైబర్ కూడా ఉంటాయి. సబ్జా గింజలలో బోరాన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం సరైన శోషణకు సహాయపడుతుంది. మీరు సబ్జా గింజలను నీటిలో నానబెట్టి, స్మూతీ, పెరుగు లేదా గంజిలో కలపడం ద్వారా తినవచ్చు.

Also read: మామూలు నడక కంటే రివర్స్‌ నడక చాలా బెటర్‌..కేవలం 15 నిమిషాలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Summer Tips: సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్

వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

New Update
summer tips

summer tips

Summer Tips: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.  అందుకే ఈ కాలంలో సరైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి.

సరైన జీవనశైలి అలవాట్లు

  • వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. రోజుకు కనీసం 3–4 లీటర్లు నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు, తాటిపండు, దోసకాయ వంటి తండ్రీ ఆహార పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. 
  • బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ధరించడం మంచిది. టోపీలు, గ్లాసెస్ వంటివి వాడడం వలన ఎండ నుంచి రక్షణ లభిస్తుంది. సూర్యుడి కిరణాలు ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లడం ఉత్తమం. 
  • వేసవిలో ఆహారం మితంగా తీసుకోవడం, పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వేసవిని సురక్షితంగా, ఆరోగ్యంగా గడపాలంటే ఈ మార్పులు అనుసరించడం అవసరం.

Summer Tips: శరీరంలో నీటి కొరత ఉంటే ఈ రోగాలు చుట్టుముడతాయి.. జాగ్రత్త!

 నిద్ర, విశ్రాంతి 

  • వేసవిలో వేడి ప్రభావం శరీర శక్తిని తగ్గిస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం  త్వరగా అలసిపోతుంది.  అలాంటి సమయంలో శరీరానికి తగిన విశ్రాంతి చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 7–8 గంటల నిద్ర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 
  • తీవ్ర మైన ఎండల  సమయంలో ఎయిర్ కండిషనర్ లేదా ఫ్యాన్ ఉపయోగించడం వల్ల నిద్రలో అంతరాయం కలగదు. మధ్యాహ్న సమయంలో 15–30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. 
  • వేసవిలో ఎక్కువ పని చేయడం వల్ల తలనొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని నివారించాలంటే తగినంత నిద్ర చాలా అవసరం. 
  • శరీరం మానసికంగా, శారీరకంగా రిఫ్రెష్ అవ్వాలంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. వేడి ప్రభావం తగ్గించడానికి గది శుభ్రంగా ఉంచడం,   ప్రాపర్ వెంటిలేషన్  ఉండేలా చూసుకోవాలి.  వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర,   విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకూడదు.

latest-news | telugu-news | summer-tips | life-style

Advertisment
Advertisment
Advertisment