Gold Rate Today : పసిడి ప్రియులకు పండగే.. ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం,వెండి!

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. అటు బంగారం, ఇటు వెండి.. రెండూ కూడా సామాన్యులకు ఊరటనిస్తూ భారీగా దిగివచ్చాయి.

New Update
gold

gold

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. అటు బంగారం, ఇటు వెండి.. రెండూ కూడా సామాన్యులకు ఊరటనిస్తూ భారీగా దిగివచ్చాయి. ఈ పతనం పసిడి ప్రియులకు నిజంగా పెద్ద ఊరట అనే చెప్పాలి.

2026 మార్చి 23వ తేదీ సోమవారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 5,950 తగ్గింది. ఈ భారీ తగ్గింపుతో ప్రస్తుతం దీని ధర రూ. 1,40,020 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 5,450 మేర ధర తగ్గింది. దీంతో ఇప్పుడు దీని ధర రూ. 1,28,350 కు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

బంగారమే కాకుండా వెండి కూడా తన పంతాన్ని వీడి కిందకు దిగొచ్చింది. వెండి ధర ఏకంగా ఒకేరోజు రూ. 20,000 మేర పతనం కావడం విశేషం. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,30,000 గా ఉంది. వెండిలో ఈ స్థాయిలో మార్పు రావడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, మార్కెట్ పరిస్థితుల కారణంగా ధరలు ఇలా భారీగా తగ్గడం విశేషం. ప్రస్తుతం ధరలు తగ్గిన నేపథ్యంలో, చాలామంది జనం జువెలరీ షాపుల వైపు అడుగులు వేస్తున్నారు. ధరలు మళ్లీ పెరగకముందే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.

బంగారం ధరలను పరిశీలిస్తే

ఇక ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే...చెన్నైలో 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ.  1,41, 280గా ఉంది. ఇక 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  1,29,500గా ఉంది, ఢిల్లీలో 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ.  1,40, 170గా ఉంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  1,28,500గా ఉంది,హైదరాబాద్ లో  24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ.  1,40,200గా ఉంది. ఇక 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  1,28,350గా ఉంది, 

అటు వెండి ధరలను పరిశీలిస్తే...చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,35,000గా ఉంది. ఢిల్లీ,  ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో ధర రూ. 2,30,000గా ఉంది. 

Advertisment
తాజా కథనాలు