ఉఫ్.. ఉఫ్.. పల్సర్ బైక్‌లపై భారీ డిస్కౌంట్లు, సూపరో సూపర్!

బజాజ్ ఆటో తన పల్సర్ బైక్‌లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్, ఎన్ఎస్ 125, ఎన్ 150, ఎన్ 160, ఎన్‌ఎస్ 200, ఎన్ 250 వంటి మోడళ్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తుంది.

New Update
Bajaj Pulsar

బజాజ్ పల్సర్ బైక్‌లకు దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. యూత్‌ ఎక్కువగా ఈ బైక్‌పైనే ఆసక్తి చూపిస్తుంటారు. లుక్, డిజైన్ పరంగా పల్సర్ బైక్‌లు బాగా ప్రజాదరణ పొందాయి. అంతేకాకుండా ధరకు తగ్గ మైలేజ్‌ను అందించి వావ్ అనిపిస్తున్నాయి. ఇక ఈ పల్సర్ బైక్‌ను కొనాలని ఆసక్తి ఉన్నవారికి గుడ్ న్యూస్. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించి అధిక సేల్స్ రాబట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. 

ఇప్పటికే చాలా కంపెనీలు సైతం ఆఫర్లు ప్రకటించాయి. అదే కోవలోకి బజాజ్ ఆటో వచ్చి చేరింది. బజాజ్ ఆటో తన పల్సర్ బైక్‌లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ ద్వారా పల్సర్ బైక్‌పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మరి ఏ ఏ మోడల్‌పై ఆఫర్ లభిస్తుంది. ఎంత డిస్కౌంట్ పొందొచ్చు అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

ఆఫర్లు:

పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్, ఎన్ఎస్ 125, ఎన్ 150, ఎన్ 160, ఎన్‌ఎస్ 200, ఎన్ 250 వంటి మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు పొందవచ్చు. వీటిపై దాదాపు రూ.5,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు డీలర్‌షిప్ షోరూమ్స్‌లో పైన్ ల్యాబ్స్ మెషీన్స్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై మరో రూ.5,000 తగ్గింపు పొందవచ్చు.

ఇది కూడా చదవండి: భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర.. ఇలాంటి ఆఫర్ మళ్లీరాదు 

అంటే దాదాపు పల్సర్ బైక్ కొనుక్కునే వారికి మొత్తంగా రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు లేకపోతే కేవలం రూ.5వేలు మాత్రమే వస్తుంది. కాగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో పల్సర్ బైక్‌ను కొనుక్కోవాలని అనుకునే వారు సైతం ఈ స్పెషల్ ఆపర్లు పొందవచ్చు. 

ఇకపోతే బజాజ్ ఆటో తన తొలి పల్సర్ బైక్‌ను 2001లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి మోడళ్లు మారుస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కో మోడల్.. ఒక్కో స్టైలిష్ లుక్‌లో కనిపించి వాహన ప్రియుల్ని బాగా అట్రాక్ట్ చేశాయి. మరి మీరు కూడా ఒక మంచి మైలేజ్ గల బైక్‌ను తక్కువ ధరలో ఆఫర్‌లతో కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం.

Advertisment
Advertisment
తాజా కథనాలు