Amazonలో అదిరే ఆఫర్లు.. ఈ 6 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

అమెజాన్లో రేపటి నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో iQOO, OnePlus, Poco, Samsung, Realme తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. SBI కార్డుతో షాపింగ్ చేస్తే అదనంగా మరో 10% శాతం తగ్గింపు పొందొచ్చు.

New Update
Amazon Offers

చాలా రోజుల తర్వాత అమెజాన్లో మళ్లీ ఆఫర్ల జాతర ప్రారంభమైంది. ఈ రోజు ప్రైమ్ మెంబర్‌ల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించింది. రేపటి నుంచి అందరికీ ఈ సేల్ అందుబాులోకి రానుంది. మీరు స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తే ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌట్ కూడా అందుకోవచ్చు.  iQOO Z9 5G, OnePlus Nord CE4 Lite 5G, Redmi Note 13 5G తదితర స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్ లో ఊహించని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.  

iQOO Z9 5G

iQOO Z9 5G: ఈ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 18,499కు బదులుగా రూ.15,999కే సొంతం చేసుకోవచ్చు. EMI యేతర లావాదేవీలపై రూ. 2,500 వరకు మరియు EMI లావాదేవీలపై రూ. 2,750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

OnePlus Nord CE4 Lite 5G
OnePlus Nord CE4 Lite 5G యొక్క 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,998 కాగా.. ఆఫర్ల తర్వాత రూ. 18,998కే సొంతం చేసుకోవచ్చు.

Poco X6 5G
Poco X6 5G యొక్క 12GB RAM+512GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 18,999కు బదులుగా ఆఫర్ పై రూ. 17,499కే సొంతం చేసుకోవచ్చు.

Redmi Note 13 5G
Redmi Note 13 5G యొక్క బేస్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.19,998 కాగా.. బ్యాంక్ ఆఫర్ల తర్వాత రూ.2 వేలకు పైగా డిస్కౌంట్ అందుకోవచ్చు.

Samsung Galaxy M55s 5G
Samsung Galaxy M55s 5G యొక్క బేస్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ సేల్ సమయంలో రూ.19,999కి అందుబాటులో ఉంది. అయితే, బ్యాంక్ ఆఫర్ల తర్వాత కేవలం రూ. 17,999కే సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo 70 Pro 5G
Realme Narzo 70 Pro 5G యొక్క 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.18,998కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను SBI కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, రూ. 1,500 వరకు అదనపు తగ్గింపు లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫైనల్ గా రూ. 17,498కే సొంతం చేసుకోవచ్చు.

Also Read :  భార్య బికినీ కోరిక.. రూ.418 కోట్లకు ఐలాండ్ కొనేసిన భర్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు