ఉద్యోగులకు షాకిచ్చిన ఫోర్డ్.. 3 వేల మంది ఉద్యోగులపై వేటు..! ఆర్థిక మాంద్యం బలహీనపడుతుందన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ కంపెనీ ఉద్యోగుల్ని తీసేశాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చు తగ్గింపులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు సైతం అదేబాటలో పయనిస్తున్నాయి. విడతల వారీగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. By Shareef Pasha 28 Jun 2023 in బిజినెస్ Scrolling New Update షేర్ చేయండి ఇప్పటి దాకా ఐటీ, ఈ కామర్స్ సంస్థలు మాత్రమే ఉద్యోగులకు లేఆఫ్ లు విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ వచ్చి చేరింది. తమ సంస్థలోని ఉద్యోగులకు లేఆఫ్ లు విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో అమెరికా, కెనడాలోని సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనుంది. మొత్తం 3 వేల మందిని తొలగించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో రెండు వేల మంది సాధారణ సిబ్బంది కాగా, మిగతా వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులని సమాచారం. తాజాగా లేఆఫ్స్ ప్రభావం అన్ని స్థాయిల్లో ఉన్న ఉద్యోగులపై వేటు పడనుంది. అయితే ఇందులో ఎక్కువగా ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉండటం గమనార్హం. లేఆఫ్ లకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేసింది. మరోవైపు భారత్తో సహా.. ఇతర దేశాల్లో ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థ.. ఖర్చు తగ్గించుకునేందుకు ఇందులో భాగంగా ఉద్యోగుల్ని ఒక్కొక్కరిగా తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకుముందు, ఐటి కంపెనీలు బ్యాడ్ టైమ్లో ఉన్న వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. గతవారం, రెండు అతిపెద్ద టెక్ కంపెనీలు గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 22,000 మంది ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ యొక్క CEO మరియు మైక్రోసాఫ్ట్ CEO ఇద్దరూ తొలగింపులకు పూర్తి బాధ్యత వహించారు. కంపెనీలు సంవత్సరాలుగా భర్తీ చేసినట్లు సూచించాయి. దీని తరువాత, భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో 400 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఐటీకి ముందు, అమెజాన్, నెట్ఫ్లిక్స్ మరియు సేల్స్ఫోర్స్తో సహా అనేక కంపెనీలు ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి