Bullet Train Project: శరవేగంగా బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. ఎప్పుడు పూర్తవుతుందంటే.. 

అహ్మదాబాద్-ముంబయి మధ్య బులెట్ రైలు కోసం ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ x ద్వారా షేర్ చేశారు. 2017లో ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ రూ.1.08 లక్షల కోట్ల ప్రాజెక్టు 2026 నాటికి పూర్తికావాలని లక్ష్యంతో పని చేస్తున్నారు. 

New Update
Bullet Train Project: శరవేగంగా బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. ఎప్పుడు పూర్తవుతుందంటే.. 

Bullet Train Project: భారత్ చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు తొలి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 100 కిలోమీటర్ల వయాడక్ట్‌లు పూర్తయ్యాయి. 250 కిలోమీటర్ల వరకు స్తంభాలను ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ముంబై-అహ్మదాబాద్ (Mumbai-Ahmedabad) మధ్య నడవనుంది. 2017 సెప్టెంబర్ 14న అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), జపాన్ ప్రధాని షింజో అబే (Shinzo Abe) ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ (High-speed rail) గా నామకరణం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 23 గురువారం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా 40 మీటర్ల పొడవైన ఫుల్ స్పాన్ బాక్స్ గర్డర్లు, సెగ్మెంట్ గర్డర్లను కలుపుతూ 100 కిలోమీటర్ల వయాడక్ట్ను నిర్మించినట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) తెలిపింది. వయాడక్ట్ అనేది రెండు స్తంభాలను కలిపే వంతెన లాంటి నిర్మాణం.

ఈ ప్రాజెక్టు కింద గుజరాత్ (వల్సాద్ జిల్లా), పూర్ణ (నవ్సారి జిల్లా), మింథోలా (నవ్సారి జిల్లా), అంబికా (నవ్సారి జిల్లా), ఔరంగ (వల్సాద్ జిల్లా), వెంగనియా (నవ్సారి జిల్లా) నదులపై వంతెనలను నిర్మిస్తున్నారు. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో 350 మీటర్ల మొదటి హిల్ టన్నెల్ నిర్మించే  పనులు పూర్తయ్యాయి. గుజరాత్ లోని సూరత్ జిల్లాలో 70 మీటర్ల పొడవైన తొలి స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ (ఎంఏహెచ్ఎస్ఆర్)లో భాగంగా నిర్మించనున్న 28 స్టీల్ బ్రిడ్జిల్లో ఇది మొదటిది.

Also Read: ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదం.. సాయంత్రం నాటికి కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్..

ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు 508 కిలోమీటర్ల దూరాన్ని మూడు గంటల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య దూరాన్ని దురంతో ఐదున్నర గంటల్లో పూర్తి చేస్తోంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్టుకు ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) అని పేరు పెట్టారు.

12 స్టేషన్లు, గంటకు 350 కిలోమీటర్ల వేగం, 3 గంటల ప్రయాణం

  • ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య సాధారణ రైలులో 7-8 గంటల దూరం ఉంది.
  • బుల్లెట్ రైలు 12 స్టేషన్లలో ఆగితే 508 కిలోమీటర్ల ప్రయాణాన్ని 3 గంటల్లో పూర్తి చేస్తుంది. అంటే సగటు వేగం గంటకు 170 కి.మీ.
  • ముంబై, అహ్మదాబాద్, సూరత్, వడోదర స్టేషన్లలో ఆగితే రెండు గంటల్లో ప్రయాణం పూర్తవుతుంది. ఈ సందర్భంలో, సగటు వేగం గంటకు 254 కిలోమీటర్లు.
  • ఈ మార్గంలో ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ముంబై స్టేషన్ భూగర్భంలో ఉంటుంది.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు