AP Cyber Criminals: ఏలూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు... ఆన్‌లైన్ పేరుతో టోకరా ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్‌లైన్ ఆఫర్లు చూసి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నా.. బాధితులు వినకుండా ఫోన్‌లో వచ్చిన ఆఫర్లు చూసి మోసపోతున్నారు. తాజాగా ఏలూరులో బిటెక్ విద్యార్థినికి సైబర్ నేరగాళ్లు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 18 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రేచ్చిపోతున్నారు. అందివచ్చిన టెక్నాలజీతో ఒక్క ఫోన్ కాల్‌తో, మెసేజ్ డబ్బులు తీసుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఒక్క నిమిషంలో ఖాతాలో ఉన్న డబ్బులను చాక చక్యంగా లాక్కుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి స్కాం వలలో ఓ మహిళ చిక్కుకుంది. ఏకంగా బురిడీ కొట్టించి రూ.34 లక్షలకుపైగా కేటుగాళ్లు కాజేశారు. అయితే ఈ మొబైల్ టెక్నాలజీ ప్రజల జీవితాల్లోకి రావడంతో ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరు తమ మొబైల్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే మొబైల్ టెక్నాలజీపై ఆధారపడి ఉన్న సమయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అధిక లాభం ఆశతో.. ఆన్‌లైన్ మోసంతో ఓ మహిళ రూ.34 లక్షలు మోసపోయింది. గూగుల్ మ్యాప్ రివ్యూ వర్క్ నిమిత్తం ఆఫర్ పేరుతో సెన్‌ఫోన్‌లో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేసింది. అయితే లింక్ పెట్టిన ప్రతి పైసాకి 40 శాతం లాభం పొందవచ్చు అంటూ లింక్‌నిర్వాహకులు ఆఫర్ ఇచ్చారు. దీంతో వ్యాపారం బాగుందని అనుకున్న బాధితురాలు అన్నపూర్ణ చెల్లింపులు మొదలుపెట్టింది. మొదట రూ.500 చెల్లించిన బాధితురాలు అన్నపూర్ణకు 40 శాతం లాభం వచ్చింది. దీంతో మరింత ఆకర్షితురాలైన అన్నపూర్ణ విడతల వారీగారూ. 30 లక్షలకుపైగా పోగొట్టుకుంది. చివరకు మోసపోయినని తెలుసుకున్న బాధితురాలు ఏలూరు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలో బీటెక్ విద్యార్థినికి సైబర్ నేరగాళ్లు టోకరా చేశారని తెలిపారు. వట్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని నుంచి ఆన్‌లైన్ టాస్క్ పేరుతో రూ.34 లక్షలు సైబర్ నేరగాళ్లు వసూళ్లు చేశారని సీఐ తెలిపారు. దశల వారీగా రూ.34 లక్షలు బాధితురాలు పొగొట్టుకుందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు అన్నపూర్ణ త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించగా.. స్పందించిన త్రీ టౌన్ సీఐ శివాజీ ఆర్టీవీతో మాట్లాడారు..ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అపరిచిత వెబ్ సైట్లతో ప్రజలు మోసపోతున్నారని వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుతో రూ.5 లక్షల ఫ్రీజ్ చేశామని సీఐ శివాజీ తెలిపారు. ఇది కూడా చదవండి: బాలికపై వాలంటీర్ దాష్టీకం..ఆధార్ కావాలంటూ ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యం #eluru-district #attacked #andra-pradesh #cyber-criminals #btech-student-annapurna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి