Telangana BSP List: తెలంగాణ బీఎస్పీ అభ్యర్థుల లిస్ట్ విడుదల.. అక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ! త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీఎస్పీ తొలి జాబితా విడుదల చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేయనున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డిపై తిరుగుబాటు ప్రకటించిన వట్టే జానయ్య యాదవ్ కు బీఎస్పీ జాబితాలో చోటు దక్కింది. By Nikhil 03 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తెలంగాణలో 20 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ తొలి జాబితాను విడుదల చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సిర్పూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇంకా పెద్దపల్లి నుంచి దాసరి ఉష (Dasari Usha), జహీరాబాద్ నుంచి గోపి, తాండూరు నుంచి చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ నుంచి వెంకటేష్ చౌహాన్, చొప్పదండి నుంచి కొంగటి శేఖర్, పాలేరు నుంచి ఆలిక వెంకటేశ్వర రావు, నకిరేకల్ నుంచి మేడి ప్రియదర్శిని, వైరా నుంచి బానోత్ రాంబాబు నాయక్, ధర్మపురి నుంచి నక్క విజయ్ కుమార్, వనపర్తి నుంచి నాగమోని చెన్న రాంబాబు ముదిరాజ్, మనకొండూరు నుంచి నిశాని రాంచందర్, కోదాడ నుంచి పిలుట్ల శ్రీనివాస్.. ఇది కూడా చదవండి: Big Breaking: తెలంగాణలో పోటీకి జనసేన సై.. 32 స్థానాలతో లిస్ట్ రిలీజ్! నాగర్ కర్నూల్ నుంచి కొత్తపల్లి కుమార్, ఖానాపూర్ నుంచి బన్సీలాల్ రాథోడ్, అందోలు నుంచి ముప్పారపు ప్రకాశం, సూర్యాపేట వట్టే జానయ్య యాదవ్, వికారాబాద్ గొర్లకాడ క్రాంతి కుమార్, కొత్తగూడం ఎర్ర కామేష్, జుక్కల్ మాధవ రావు అంబేద్కర్ పోటీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన వట్టే జానయ్య యాదవ్ కు సూర్యాపేట బీఎస్పీ టికెట్ దక్కడం గమనార్హం. ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే అభ్యర్థులను ప్రకటించగా తాజాగా బీఎస్పీ అభ్యర్థులను ప్రకటించించింది. త్వరలోనే మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీఎస్పీ వర్గాలు వెల్లడించాయి. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కని కొందరు నేతలు బీఎస్పీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లిస్ట్ తయారుగా ఉన్నా కూడా.. ప్రకటనను ఆపి వేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ టికెట్ల ప్రకటన తర్వాత బీఎస్పీ అభ్యర్థుల ప్రకటన విడుదలయ్యే అవకావం ఉన్నట్లు సమాచారం. #bsp #telangana-election-2023 #ts-bsp-chief-rs-praveen-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి