BSE సరికొత్త కొత్త రికార్డు, తొలిసారిగా రూ.300 లక్షల కోట్లు దాటిన ట్రేడ్ మార్క్ గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు దూకుడును ప్రదర్శిస్తున్నాయి. కాగా... బుధవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సంపదగా పరిగణించే BSEలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 300 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయికి చేరడం చరిత్రలోనే ఇది మొదటిసారని చెప్పాలి. అంతేకాకుండా అంతర్జాతీయ సంకేతాలకు అనుకూలంగా ఉండటం, దేశీయంగా పెట్టుబడులు వెల్లువెత్తడంతో మదుపర్ల సంపద 300 లక్షల కోట్లకు చేరిందని స్టాక్ ఎక్స్‌ఛేంజ్ తెలిపింది. By Shareef Pasha 06 Jul 2023 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి గతంలో కోవిడ్ సమయంలోనూ ప్రపంచ మార్కెట్లు గణనీయంగా పడిపోయినా..దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం పైపైకి ఆకాశం ఎత్తు ఎగిశాయి. 2020 నుండి దేశీయ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం కూడా భారతీయ మార్కెట్లకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఫారిన్ ఇన్స్‌టిట్యూషన్ ఇన్వెస్టర్లు FIIs,డిమెస్టిక్ ఇన్స్‌టిట్యూషనల్ ఇన్వెస్టర్లు DIIs,స్టాక్ మార్కెట్లలో భారీ ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు 8 శాతం దాకా పెరిగాయని ఇన్వెష్టర్లు భావిస్తున్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో చూస్తే ఇప్పటిదాకా BSE ఇండెక్స్‌లు అంటే సెన్సెక్స్ , నిఫ్టీ 6 శాతం దాకా పెరగడం విశేషం. ఒక్క జూన్ క్వార్టర్‌లోనే విదేశీ ఇన్వెస్టర్లు మన దేశంలో పెట్టిన పెట్టుబడులు దాదాపు 82 వేల కోట్లుగా ఉన్నాయి. ఈ యేడాది మార్చ్ నుండి చూస్తే మదుపర్ల సంపద 18.5 శాతం పెరగడం గమనార్హం. ఈ సంవత్సరం మార్చ్ నెలలో BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 252 లక్షల కోట్లుగా ఉంటే.. జూలై 5 వ తేదీ నాటికి ఇది 300 లక్షల కోట్లకు చేరింది. అంటే కేవలం 3 నెలల్లోనే 48 లక్షల కోట్లు పెరగడం విశేషంగా పరిగణించాలి. అయితే గత 3 నెలలుగా చూస్తే దేశీయ ఇండెక్స్‌లైన నిఫ్టీ , సెన్సెక్స్ లు 12 శాతం లాభాలను అందించాయి. BSE,స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా 22 శాతం మేర రాణించాయి. హై నెట్ వర్త్ స్టాక్స్ రాణించడం, HDFC విలీనం తరువాత ఆ షేర్ మరింత లాభపడటం, పలు సెక్టోరియల్ ఇండెక్స్‌లు కూడా బుల్లిష్ గా ఉండటంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయని చెప్పొచ్చు. కాగా నేటి మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఆరంభించినా.. వేగంగా పుంజుకుని లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 100 పాయింట్లు, సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. జూలై 6 వ తేదిన స్టాక్ మార్కెట్లలో బ్రిటానియా అత్యధిక లాభాలు పొందిన షేర్‌గా చరిత్రలో నిలిచింది. ఈ స్టాక్ ఉదయం 117 లాభంతో 5,213 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, రిలయన్స్, కోల్ ఇండియా వంటి స్టాక్స్ లాభాల్లో తమ దూకుడును పెంచుతూ కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్ వంటి స్టాక్స్ 2 నుండి 1 శాతం దాకా నష్టాలతో డౌన్ అవుతూ ట్రేడ్ అవుతున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి