BRS MLA: సీనియర్లకు హ్యాండిచ్చిన కేసీఆర్ : తాండూర్, పాలేరు, మహేశ్వరం, కొత్తగూడెంలో ఇదే సీన్

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ స్కెచ్‌లు వేస్తున్నారు. ఈక్రమంలోనే ఆనవాయితీగా శ్రావణమాసం తొలి సోమవారం రోజున ఫస్ట్‌ లిస్ట్‌ను ప్రకటించారు. ఇందులో పలువురు సీనియర్ నేతలకు మొండి చేయి చూపారు. పక్కాగా సీటు వస్తుందని ఆశించి కొందరు నేతలు భంగపడ్డారు.

New Update
BRS MLA: సీనియర్లకు హ్యాండిచ్చిన కేసీఆర్ :  తాండూర్, పాలేరు, మహేశ్వరం, కొత్తగూడెంలో ఇదే సీన్

BRS Senior leaders : బీఆర్ఎస్ లో ఓ వెలుగువెలిగిన కొందరు సీనియర్లకు ఇప్పుడు టిక్కెట్ దక్కలేదు. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జలగం వెంకట్రావుతోపాటు పలువురు నేతలు ఉన్నారు.

publive-image తుమ్మల నాగేశ్వరరావు

బీఆర్ఎస్‌లో తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ తొలి కేబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. కీలక శాఖలను చూశారు. 2014లో రోడ్లు, భవనాల శాఖను తుమ్మల చూస్తే..పట్నం మహేందర్‌రెడ్డి రవాణా శాఖను చూశారు. 2014 ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల, తాండూర్‌ నుంచి పట్నం గెలిచారు. ఐతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో పట్నం సోదరులకు చెక్‌ పడినట్లు అయ్యింది. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రోహిత్‌కే సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు.

publive-image పట్నం మహేందర్‌రెడ్డి

తుమ్మల విషయంలోనూ ఇదే జరిగింది. 2018 ఎన్నికల్లో పాలేరులో హస్తం అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్‌లోకి వచ్చారు. తాజాగా మరోసారి ఉపేందర్‌రెడ్డికే అవకాశం వరించింది. ఇటు మహేశ్వరం అసెంబ్లీ స్థానంలోనూ ఇలాంటి సీన్‌ రిపీట్ అయ్యింది. కాంగ్రెస్‌ తరపున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి..గులాబీ గూటికి చేరి మంత్రి అయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తరపున సబితా బరిలో నిలవనున్నారు. తీగలకు టిక్కెట్ చేజారిపోయింది.

BRS Senior leaders తీగల కృష్ణారెడ్డి

మరో సీనియర్ నేత జలగం వెంకట్రావుకు సైతం చుక్కెదురు అయ్యింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు..ఆ తర్వాత కారెక్కారు. ఈసారి కూడా ఆయననే అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఉప్పల్‌ నుంచి పోటీ చేయాలని భావించిన బొంతూ రామ్మోహన్‌కు సైతం భంగపడినట్లు కనిపిస్తోంది. ఇలా సీనియర్ నేతలకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల రూపంలో షాక్‌ తగిలింది. తమకే టికెట్ వస్తుందని..పార్టీ కోసం పనిచేశామని గట్టిగా నమ్మిన నేతలకు సీఎం కేసీఆర్ ఝలక్‌ ఇచ్చారు.

BRS Senior leaders జలగం వెంకట్రావు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News: రేపే ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 22, 2025 08:32 IST

    పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..

    పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుది శ్వాస విడిచారు. ఆయన మరణానికి సంబంధించి ఈరోజు డెత్ రిపోర్ట్ వచ్చింది. పోప్ గుండెపోటుతో మృతి చెందారని..చనిపోయే ముందు ఆయన కోమాలోకి వెళ్ళారని డాక్టర్ ఆండ్రియా రిపోర్ట్ ను విడుదల చేశారు. 

    rome
    Pope Francis

     



  • Apr 22, 2025 08:31 IST

    రేపే ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌!

    ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మన మిత్ర,వాట్సాప్‌ యాప్,లీప్ మొబైల్‌ యాప్‌ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

    Read More



  • Apr 22, 2025 08:30 IST

    స్కూళ్లకు వేసవి సెలవులు

    తెలంగాణలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల కోసం వేసవి సెలవుల తేదీలను అధికారికంగా ప్రకటించింది.



  • Apr 22, 2025 08:29 IST

    మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

    నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మహేష్ రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 



  • Apr 22, 2025 08:29 IST

    పదేళ్ల పిల్లలకూ బ్యాంక్ అకౌంట్లు..ఆర్బీఐ అనుమతి

    మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వరు. ఇప్పటివరకు గార్డియన్ ఎవరైనా ఉంటే మైనర్లకు అకౌంట్లు తెరవొచ్చును. కానీ తాజాగా ఆర్బీఐ పదేళ్ల వారు కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది. 

    RBI



  • Apr 22, 2025 08:28 IST

    కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

    హుస్నాబాద్‌ సాయి ప్రకాష్ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. కానిస్టేబుల్ శ్రీనివాసరావుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రకాష్‌ పిన్ని నిర్మల.. అలా చేయొద్దని చెప్పినందుకు సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

    tg crime
    tg crime Photograph: (tg crime)

     



  • Apr 22, 2025 08:27 IST

    నేడే తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్

    తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ ఫోన్‌లో కూడా రానున్నాయి.  

    Mallu Bhatti Vikramarka
    Mallu Bhatti Vikramarka

     



  • Apr 22, 2025 08:27 IST

    Ap-Telangana: బీ అలర్ట్‌...7 రోజులపాటు వర్షాలు..!

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

    rains
    rains Photograph: (rains)

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు