CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్ లు ఇవ్వనున్నట్లు చెప్పారు. రేపు మిగతావారికి అందిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

New Update
CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ (CM KCR) సమావేశమయ్యారు. ఈ రోజు కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్ లు అందించనున్నట్లు ప్రకటించారు. మిగతా బీఫామ్ లు రేపటిలోగా అందిస్తామన్నారు. నిన్నటి వరకు మంచి రోజులు లేకపోవడంతో బీఫామ్ లు అన్నీ సిద్ధం చేయలేకపోయినట్లు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. అభ్యర్థులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని.. అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. విపక్షాల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్థికంగా, సాంకేతికంగా దెబ్బతీసేందుకు జరిగే ప్రయాత్నాలపై జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టాలన్నారు.

కోపతాపాలను పక్కనపెట్టి నాయకుల నుంచి కింది స్థాయిలో ఉన్న వారి వరకు ప్రతీ ఒక్కరినీ కలుపుకుపోవాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. గత ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలా పంతానికి పోయి ఓడిపోయారని చెప్పారు కేసీఆర్. కొంతమంది చిలిపి, చిల్లర పనులను చేసి టికెట్లను పోగొట్టుకున్నారన్నారు. దారి తప్పిన వాళ్లకు తప్పా.. సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తామని గతంలో చెప్పామని గుర్తు చేశారు.

వేములవాడలో చెన్నమనేని రమేష్ మళ్లీ గెలిచే అవకాశం ఉన్నా.. న్యాయపరమైన చిక్కులతో ఆయనకు అవకాశం కల్పించలేకపోయామన్నారు. సీట్ల సర్దుబాటు చాలా సామరస్యపూర్వకంగా జరిగిందన్నారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని.. ఈ విషయంలో హైరానా వద్దని అభ్యర్థులకు సూచించారు కేసీఆర్. ముందుగానే బీ ఫామ్ లను ఇస్తున్నామని.. జాగ్రత్తగా బీ ఫామ్స్ నింపాలని సూచించారు.

ఇంకా చివరి రోజు వరకు నామినేషన్ వేయకుండా ఆగి ఇబ్బంది పడవద్దన్నారు. శ్రీనివాస్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తోం పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు వచ్చాయని గుర్తు చేశారు. సందేహాలుంటే తమ లీగల్ టీమ్ ను సంప్రదించాలన్నారు. ప్రస్తుతం అభ్యర్థులతో కలిసి లంచ్ చేస్తున్నారు కేసీఆర్. లంచ్ మీటింగ్ తర్వాత మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.

ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు