BRS MLC Kavitha: గవర్నర్ ప్రసగంలోని ఆ పదాలు తొలగించండి.. మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ

గవర్నర్ స్పీచ్ లో పలు పదాలను తొలగించాలని మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ప్రసంగంలోని "విముక్తి", "అణచివేత", "నియంతృత్వ పాలన", "వ్యవస్థల విధ్వంసం", "వివక్ష" తదితర పదాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు

గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు మండలి చైర్మన్ కు కవిత లేఖ రాశారు. ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత మండలి చైర్మన్ ను కోరారు. "విముక్తి", "అణచివేత", "నియంతృత్వ పాలన", "వ్యవస్థల విధ్వంసం", "వివక్ష" వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదించారు. దీంతో కవిత లేఖపై మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: CPI: ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది… కూనంనేని సంచలన వ్యాఖ్యలు!

ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీలోనూ గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యల మధ్య హాట్ డిస్కషన్ చోటు చేసుకోంది.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు