Kavitha : మహేందర్ రెడ్డిని TSPSC చైర్మన్‌గా తొలిగించాలి.. కవిత డిమాండ్

TSPSC చైర్మన్‌గా తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నియమించడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

New Update
MLC Kavitha: ఎలా అరెస్ట్ చేస్తారు?.. కోర్టుకు కవిత

MLC Kavitha On TSPSC Chairman Mahender Reddy: టీఎస్పీఎస్సీ(TSPSC) చైర్మన్ మహేందర్ రెడ్డి(Mahender Reddy)పై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సూచించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణ యువతకు ఎలా న్యాయం చేయగలుగుతారని ప్రశ్నించారు.

దూషించడంలో ముందున్నారు..

కేసీఆర్ ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అప్పుడు ముందున్నారని, వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి అత్యంత భయంకరంగా ఉచ్ఛరించడానికి వీలులేని భాషలో దూషించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్లు డీజీపీగా పనిచేసిన వ్యక్తిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారని, రిటైర్డ్ అధికారులను కేసీఆర్ ఆయా పోస్టుల్లో నియమిస్తే విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పనిచేస్తున్నదని మండిపడ్డారు.

Also Read : Yatra 2 : నో డౌట్.. ఈ రెండో యాత్ర సినిమా వైసీపీకి బూస్టర్ డోస్

ఆంధ్ర అధికారులు

టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించిన వై రామ్మోహన్ రావు తెలంగాణ కు చెందిన వ్యక్తి కాదని, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలో ఆంధ్ర వ్యక్తిని నియమిస్తే సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా ? అన్నది సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్న వారిని సభ్యులుగా నియమించబోమని చెప్పిన సీఎం టీడీపీలో పనిచేసిన రజని కుమారిని (Rajani Kumari) ఎలా నియమించారు? అని అడిగారు. మహేందర్ రెడ్డి రూ. లక్ష కోట్ల మేర అక్రమార్జన చేశారని అవినీతి ఆరోపణలు వచ్చాయని, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డిని తక్షణమే తప్పించి జ్యుడిషియల్ విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. త్వరలో తాము ఈ అంశంపై గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందిస్తామని వెల్లడించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చింది..

స్టాఫ్ నర్స్, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపట్టడంతో పాటు మినీ అంగన్ వాడీలను బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్ గ్రేడ్ చేసిందని, కానీ ఇప్పుడు తాము నియామకపత్రాలు ఇస్తామంటున్నారని తప్పుబట్టారు. కేసీఆర్ చేసిన పనులు తామే చేస్తున్నామని చెప్పకుంటుంటే ఇక ప్రజలు అధికారం ఎందుకిచ్చినట్లని అడిగారు. ప్రజలు అధికారమిచ్చినప్పుడు కొత్త పనులు, ప్రజలకు పనికివచ్చే పనులు చేయాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరులోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం 60 మాత్రమే కొత్త ఉద్యోగాలను నోటిఫై చేసిందని ప్రస్తావించారు. గతంలో కేసీఆర్ నోటిఫై చేసిన ఉద్యోగాలను ఇప్పుడు ఇస్తున్నారని చెప్పారు. చేయని పనులు చేస్తున్నామని చెప్పడం మానేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.

Also Read : Balakrishna: బినామీల పేరుతో 214 ఎకరాలు.. కస్టడీలో కీలక వివరాలు

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు