Telangana: సిరిసిల్లలో ఉంటే ఎప్పుడో క్లియర్ అయ్యేది.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోట షాకింగ్ కామెంట్స్..

బీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సంచలన కామెంట్స్ చేశారు. సొంత పార్టీపైనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే.. తానే తిరగబడి పోరాటం చేస్తానని అన్నారు. ముంపు గ్రామాలు సిరిసిల్లలో ఉంటే.. ఈపాటికి సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యి ఉండేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

New Update
Telangana: సిరిసిల్లలో ఉంటే ఎప్పుడో క్లియర్ అయ్యేది.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోట షాకింగ్ కామెంట్స్..

MLA Chennamaneni Ramesh: బీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు(Ramesh Babu) సంచలన కామెంట్స్ చేశారు. సొంత పార్టీపైనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే.. తానే తిరగబడి పోరాటం చేస్తానని అన్నారు. ముంపు గ్రామాలు సిరిసిల్లలో ఉంటే.. ఈపాటికి సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యి ఉండేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం నాడు.. వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామపంచాయితీ భవనంను వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. సొంత ప్రభుత్వంపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు.

చెన్నమనేని రమేష్ ఏమన్నారో ఆయన మాటల్లోనే యధావిధిగా..

⇒ మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే నేనే తిరగబడి పోరాటం చేస్తా.

⇒ ముంపు గ్రామాలు సిరిసిల్లలో ఉంటే ఎప్పుడో పరిష్కారం అయ్యేవి.

⇒ అసెంబ్లీలో ముప్పు గ్రామాల సమస్యలపై అధికార పక్షం లాగ కాకుండా, ప్రతిపక్షం నేతగా పోరాటం చేశాను.

⇒ ఒకను ఒక దశలో మంత్రి కేటీఆర్‌తో అన్నాను. ముంపు గ్రామాలు సిరిసిల్లలో ఉంటే బాగుండేదని, సమస్యలు తొందరగా పరిష్కారం అయ్యేవనీ.

⇒ మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలపై ప్రశ్నించాను. ఇవన్నీ విషయాలు ప్రజలకు ముంపు గ్రామాల నిర్వాసితులకు తెలియాల్సిన అవసరం ఉంది.

⇒ ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఎక్కని గడప లేదని, కాళ్లు మొక్కడం తప్ప అన్ని చేశాను.

⇒ చెన్నమనేని రాజేశ్వర రావు కూమారుడిని కాబట్టి.. అత్మగౌరవం ఉంది కాబట్టి.. నేను కాళ్ల మొక్కను.

⇒ అవసరం అయితే, సమస్యలు పరిష్కారం కాకుంటే పోరాటం చేస్తాను.

⇒ విషాధ గాధల నుండి పాఠాలు నేర్చుకోవాలని నేర్చుకున్నవారే ప్రజలకు చేరువ అవుతారు. అని ఎన్నడూ లేని విధంగా, కొత్తగా ప్రసంగించారు.

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరకాలలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గతంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. కేటీఆర్ సభ విజయవంతం గా నిర్వహించుకుంటామన్నారు. దళిత బంధు విషయంలో ఒక యూనిట్ ఒక్క దళితునికి మాత్రమే ఇస్తున్నామని తన నియోజకవర్గంలో అలాంటిదేమీ జరగలేదన్నారు.

Also Read:

TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త

రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు