Harish Rao: నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు ఇవ్వాలి.. సీఎం రేవంత్ కు హరీష్ లేఖ TG: గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-2, గ్రూప్-3కి ఉద్యోగాలు కలుపుతామన్న హామీ నిలుపుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 22 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై లేఖలో ప్రస్తావించారు. ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య వ్యవధి ఎక్కువ ఉండాలని అన్నారు. పరీక్షల మధ్య తక్కువ విరామం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. గ్రూప్-2, గ్రూప్-3కి ఉద్యోగాలు కలుపుతామన్న హామీ నిలుపుకోవాలని అన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అన్న మాటకు కట్టుబడాలని హితవు పలికారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి బకాయిలతో చెల్లించాలని అన్నారు. చెప్పిన మాట ప్రకారం జీవో నంబర్ 46ను రద్దు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై @TelanganaCMO గారికి బహిరంగ లేఖ. pic.twitter.com/yGCQwbJKnE — Harish Rao Thanneeru (@BRSHarish) June 22, 2024 #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి