Harish Rao: ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. By Nikhil 09 Sep 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమని బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు అని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత ఫిటీషన్ల పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం… — Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2024 తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై.. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిస్తున్నామన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి