Kavitha: నేడు ఎమ్మెల్సీ కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

New Update
Telangana : తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్

MLC Kavitha : మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలు మార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వెయ్యగా.. కవితకు ఈ విషయం లో నిరాశే ఎదురైంది. ప్రతిసారి బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ల పై విచారించిన ధర్మాసనం వారికి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : వైసీపీ నేత దారుణ హత్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..

క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఒక బంతితోనే మొత్తం మ్యాచ్ అంతా సాగేలా కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది. 

New Update
cricket

One day Cricket

వన్డే మ్యాచ్ లలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లలో బౌలింగ్ కు కూడా ప్రాముఖ్యం ఉండేలా మొత్తం మాచ్ అంతా ఒకే బంతితో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పదేళ్లకు పైగా కొనసాగుతున్న రెండు కొత్త బంతుల పద్ధతిని ఐసీసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నేతృత్వంలో ఐసీసీ క్రికెట్ కమిటీకి కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం జింబాబ్వేలో ఐసీసీ మీటింగ్స్ అవుతున్నాయి. వీటిల్లో దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  

ఒక బంతితోనే..

పదేళ్ల క్రితం వరకు వన్డేలు ఒకే బంతితో ఆడేవారు. బాల్ పాతబడితే రివర్స్ స్వింగ్ బాగా తిరుగుతుంది. అప్పుడు స్పిన్నర్లకు కూడా బంతి మీ పట్టు చిక్కుతుంది. స్పిన్ ను బాగా చేయగలిగే వారు. కానీ పదేళ్ల కితం దీనిని మార్చారు. ఒక్కో ఎండ్‌లో ఒక్కో కొత్త బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. దీంతో ఒక బంతి ఎక్కువలో ఎక్కువ 25 ఓవర్ల వరకే ఉపయోగించగలుగుతున్నారు. దీంతో రివర్స్ స్వింగ్ సాధ్యపడటం లేదు. బంతిని స్పిన్ చేయడం కూడా అవడం లేదు. దీంతో బౌలర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాటర్లకు ఇది బాగా లాభిస్తున్నా..బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్నారు, వికెట్లు తీయడం లేదనే మాటలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు రెండు బాల్స్ రూల్ ను తీసేయాలని గుంగూలీ కమిటీ ప్రతిపాదిస్తోంది. దీంతో పాటూ టెస్ట్ లు, టీ20ల్లో కూడా పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

today-latest-news-in-telugu | one-day | cricket | icc

Also Read: AP: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

 

 

Advertisment
Advertisment
Advertisment