/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-36.jpg)
Ramagundam: బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ ఆందోళన వ్యక్తం చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ M. శ్రీనివాసులు కలిశారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో బీఆర్ఎస్ యువ నాయకులు గడప రాకేష్ ను హత్య చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు పాల్గొన్నారు.