Kavitha : బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కోస్తాం

పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే నాలుక కోస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

New Update
Kavitha : బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కోస్తాం

పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు. బండి సంజయ్ కరెంట్ తీగలు పట్టుకుంటే కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటు‌లో ఒక్క మాట కూడా సంజయ్ మాట్లాడలేదని మండిపడ్డారు. చాలా వ్యక్తిగతంగా మా నాయ‌కుడు కేసీఆర్‌ను బండి సంజయ్​ తిట్టారని.. అది ఆయ‌న విజ్ఞత‌కే వ‌దిలేస్తున్నా అన్నారు. ఆయ‌న మాట‌ల‌ను తెలంగాణ ప్రజ‌లు గ‌మ‌నిస్తున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తూ పార్లమెంట్‌లో నిల‌బ‌డి అబ‌ద్దాలు మాట్లాడ‌టం స‌రికాదని సూచించారు. మిష‌న్ భ‌గీర‌థ‌కు రూ. 24 వేల కోట్లు ఇవ్వమని నీతిఆయోగ్​ చెప్పినా ఇవ్వలేదని ఆమె ఫైర్ అయ్యారు.

తొలి నుంచి సీఎం కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ అవాకులు చవాకులు పేలుతున్నారని సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తమ నాయకుడిపై ఎలా పడితే అలా మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీ ఎంపీ బండి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. ఏది పడితే అది మాట్లాడితే నాలుక కోస్తామని బీఆర్‌ఎస్ ఎంపీ మాలోత్ కవిత హెచ్చరించార. సంజయ్ బాఫ్ఫున్ లాగా మాట్లాడారని.. ఆయన మాటలు చూస్తుంటే బీజేపీ పెద్దలతో పాటు మోదీ దగ్గర మార్క్‌లు కొట్టేసే విధంగా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత నిప్పులు చెరిగారు. "నేను ఎక్క‌డ పోను బిడ్డా.. నిజామాబాద్ పార్ల‌మెంట్‌కు వ‌స్తా.. క‌చ్చితంగా గెలుస్తా. నాది నిజామాబాదే" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "నేను ఇంత‌కుముందే చెప్పిన.. బ‌తికున్నా.. చ‌నిపోయినా.. రేపు నా క‌ట్టే కాలేది కూడా నిజామాబాద్‌లోనే అని క‌విత అన్నారు. క‌చ్చితంగా నిజామాబాద్ నుంచే పార్ల‌మెంట్‌కు పోటీ చేస్తా. నేను పారిపోయేది లేదు. నువ్వే కోరుట్ల పోతా.. అక్క‌డ పోతా.. ఇక్క‌డ పోతా అని అంటున్న‌వ‌ట‌. కోరుట్ల‌కు పో.. అక్క‌డ‌కు కూడా వ‌చ్చి నిన్ను ఓడిస్తా. నువ్వు ఎక్క‌డ‌న్న పో.. స‌ర్పంచ్‌గా, ఎంపీటీసీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్త‌వ‌.. నిన్ను వ‌దిలిపెట్ట‌.. ఫ‌స్ట్ వాగ‌డం త‌గ్గించుకో" అని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు ఎన్ని మాట్లాడినా కేసీఆర్‌ను ప్రజలు ఆశీర్వ‌దిస్తారు అని క‌విత పేర్కొన్నారు.

నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏడు సెగ్మెంట్లు ఉంటే.. ప్ర‌తి సెగ్మెంట్‌లో నీకు టికెట్ అంటే నీకు టికెట్ అంటే అని చెప్పి అంద‌ర్నీ ముంచుత‌డని విమర్శించారు. మొన్న వాళ్లంద‌రూ క‌లిసిపోయి ఆయ‌న ఆఫీసులో దాడి చేశారన్నారు. ఓవైపు ప్ర‌జ‌లను మోసం చేయ‌డం.. మరోవైపు సొంత పార్టీ నాయ‌కుల‌ను మోసం చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటుగా మారింద‌ని ఆమె మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు