MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్!

ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు

MLC Kavitha: తెలంగాణ రాజకీయ నాయకులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాలు (Social Media Accounts Hack), ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. తాజాగా వారి టార్గెట్ ఎమ్మెల్సీ కవిత అయింది ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి (Telangana DGP) ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన

లిస్టులో గవర్నర్ తమిళిసై..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు (Tamilisai Soundararajan) సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. గవర్నర్ తమిళి‌సై అఫీషియల్ ట్విట్టర్ ఖాతాను (Twitter Account Hack) హ్యాక్ చేశారు. ఈనెల 14న దీనిపై సైబర్ క్రైమ్‌లో రాజ్ భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ట్విట్టర్ (X) ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు ఇతర ఫోటోలు పెట్టడంతో పోలీసులకు అధికారులు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మంత్రి దామోదర రాజనర్సింహ కూడా..

ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ తమిళి‌సై యే కాకుండా ఈ లిస్టులో మొదటి వరుసలో నిలిచారు కాంగ్రెస్ మంత్రి. ఇటీవల వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ( Damodar Raja Narasimha) ఫేస్ బుక్ అకౌంట్‌ను సైతం సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన ఫేస్ బుక్ ఖాతాలో టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, తమిళనాడు సీఎం స్టాలిన్ కు సంబంధించిన పోస్టులు దర్శనమివ్వడంతో ఈ విషయాన్ని గుర్తించారు. దీనిపై మంత్రి దామోదర రాజ నర్సింహ స్పందిస్తూ తన పేరుపై వస్తున్న మెసేజిలకు ఎవరు రెస్పాండ్ కావద్దని అన్నారు. దీనిపై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హ్యాకర్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rythu Bandhu: రైతు బంధుపై కీలక అప్డేట్

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు