TS: చట్నీలో పడిన ఎలుక కోసం వెళ్లిన పిల్లి.. బీఆర్ఎస్ నేత సెటైరికల్ ట్వీట్..! హైదరాబాద్ KPHBలోని జేఎన్టీయూ క్యాంపస్‌లోని కిచన్ లోకి ఓ పిల్లి పెరుగు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఈ వీడియోను ఉద్దేశిస్తూ ఇటీవల సుల్తాన్‌పూర్ జేఎన్టీయూలో చట్నీలో ఉన్న ఎలుక కోసం నేడు ఈ పిల్లి వెళ్లిందని సెటైర్లు వేశారు. By Jyoshna Sappogula 17 Jul 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: ఇటీవల జేఎన్టీయూ సుల్తాన్‌పూర్ బ్రాంచ్ హాస్టల్‌లో చట్నీలో ఎలుక పడిన సంగతి తెలిసిందే. చట్నీలో పడిన ఎలుక అందులోంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారి తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ఘటనపై స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సపల్ తినడానికి పెట్టినప్పుడు ఎలుక పడలేదని చట్నీతో ఉన్న పాత్రను క్లీన్ చేయడానికి పెట్టినప్పుడు పడిందని క్లారిటీ ఇచ్చారు. Also Read: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్..! అయితే, తాజాగా హైదరాబాద్ KPHBలోని జేఎన్టీయూ క్యాంపస్‌లోని కిచన్ లో ఓ పిల్లి పెరుగు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఈ వీడియోను ఉద్దేశిస్తూ ఇటీవల సుల్తాన్‌పూర్ జేఎన్టీయూలో చట్నీలో ఉన్న ఎలుక కోసం నేడు ఈ పిల్లి వెళ్లిందని సెటైర్లు వేశారు. కాగా, ఈ విషయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. When authorities couldn't find, this time a CAT came in search for the RAT in the Food of JNTU Hyderabad Boys Hostel pic.twitter.com/dINeCtGv0J — Krishank (@Krishank_BRS) July 16, 2024 #jntu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి