Medigadda: మేడిగడ్డ సేఫ్.. బ్యారేజ్ పై నుంచి లైవ్ లో వివరించిన జగదీష్ రెడ్డి మేడిగడ్డ వద్ద ఒక్క గేటు కొంత కుంగితేనే కాంగ్రెస్ ఎంతో దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పై నుంచి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. సంబంధం లేని సాకులతో కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేస్తోందన్నారు. By Nikhil 26 Jul 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ పై నుంచి ఆయన మాట్లాడుతూ.. రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇంత నిర్లక్ష్యమా అని కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఇప్పుడు నీళ్లు ఇస్తే వాళ్ల బాగోతం బయట పడుతుందని భయపడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారమంతా తప్పని తెలిపోతుందని పంటలు ఎండ పెట్టారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని వివరించారు. Your browser does not support the video tag. గతంలో 28 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చిందన్నారు. అంత ప్రవాహం ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. ఒక్క గేటు కొంత కుంగితేనే కాంగ్రెస్ ఎంతో దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందిందని ఫైర్ అయ్యారు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఇంజనీర్లే చెబుతున్నారన్నారు. ఇప్పుడు కూడా నీళ్లు ఇచ్చేందుకు ఎలాంటి సమస్యలేదంటున్నారని చెప్పారు. నీళ్లొచ్చే కన్నెపల్లి పంప్ హౌజ్ కాళేశ్వరానికి 20 కి.మీ పైన ఉందన్నారు. అది ఎప్పటికీ లిఫ్ట్ చేస్తూనే ఉంటుందని చెప్పారు. సుందిళ్ల, అన్నారంలో కొత్తగా ఏమైనా ఇబ్బందులొస్తాయనే ప్రచారంతో తప్పుదోవ పట్టించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు.. మనకు నీళ్లిచ్చే కన్నెపల్లికి ఎత్తిపోయడానికి సంబంధమే లేదన్నారు. సంబంధం లేని సాకులతో కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై చేసిన దుష్ప్రచారానికి కాంగ్రెస్ రైతంగానికి క్షమాపణ చెప్పి నీళ్లను అందించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి