BRS Harish Rao: ఆ కండిషన్ తొలగించాల్సిందే: హరీష్ రావు డిమాండ్

రూ.2 లక్షల కన్నా ఎక్కువ లోన్ ఉన్న రైతులకు రుణ మాఫీపై పెట్టిన కండిషన్ ను తొలగించాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాఫీ చేసే మొత్తం పోను మిగిలిన మొత్తం ముందే చెల్లించాలని రూల్ పెట్టడంతో రైతులు మళ్లీ అప్పుల పాలు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
BRS Harish Rao: ఆ కండిషన్ తొలగించాల్సిందే: హరీష్ రావు డిమాండ్

రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న అప్పు ఉన్న రైతులకు రుణ మాఫీపై ప్రభుత్వం పెట్టిన కండిషన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం పెట్టిన ఈ కండిషన్ తో రూ.3 లక్షల అప్పు ఉన్న రైతులు రూ.లక్ష ముందుగానే కట్టాలన్నారు. అప్పుడే ప్రభుత్వం చెబుతున్నట్లు రూ.2 లక్షల రుణ మాఫీ జరుగుతుందన్నారు. అంటే ఆ రూ.లక్ష కోసం రైతు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం ఉందన్నారు.

రుణ మాఫీ కోసం రైతు మళ్లీ అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుకు సకాలంలో అప్పు పుట్టకపోతే రుణమాఫీ ఆలస్యం అవుతుందన్నారు. ఇలాంటి కండిషన్లు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో రూ.2 లక్షలు జమ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలా చేస్తే రైతులకు వడ్డీ భారం తగ్గుతుందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు