Telangana : గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం.. కాంగ్రెస్ కరపత్రం చదివారంటూ..

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదనట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.

New Update
Telangana : గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే అభ్యంతరం.. కాంగ్రెస్ కరపత్రం చదివారంటూ..

BRS Ex MLA Kranthi Kiran : అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) ప్రసంగంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(Kranthi Kiran) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కరపత్రం చదివినట్లుగా ఉందన్నారు. రాష్ట్ర మొదటి పౌరురాలిగా ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి.. కాంగ్రెస్ కార్యకర్త మాదిరిగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదన్నారు. గవర్నర్ గవర్నర్ హోదాలో ఉండి.. గత ప్రభుత్వ పనితీరును బాధ్యతాయుతంగా విభేదిస్తూనే.. ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులను సూచించాల్సిందన్నారు. కానీ, అసెంబ్లీ వేదికగా ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా మాట్లాడినట్లుగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్(KCR) హయాంలో గత ప్రభుత్వం చేసిన పనులను.. ప్రగతిని.. దేశమే కాదు.. ప్రపంచంలోని పలు సంస్థలు ప్రశంసిస్తూ అవార్డులు సైతం ఇచ్చారని గుర్తు చేశారు క్రాంతి కిరణ్. గత ప్రభుత్వ హయంలో అసలు అభివృధే జరగలేదన్నట్లు.. హైదరాబాద్‌లో కొత్తగా మార్పులు ఏమి కనపడటం లేదు అన్నట్లు మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు.

ప్రతి రోజు హైదరాబాద్ లో తిరిగే గవర్నర్ గారికి అక్కడ జరిగిన అభివృద్ధి కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మీకు కనపడకపోతే మా అందోల్ నియోజకవర్గానికి వస్తే చూపిస్తామన్నారు. ముందు నుంచి చెబుతున్నట్లే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్న క్రాంతికిరణ్.. ఇవాళ గవర్నర్ ప్రసంగంతో ఆ విషయం మరోసారి రుజువయిందన్నారు. అసెంబ్లీ వేదికగా హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారు.. గవర్నర్ వ్యవస్థను అపహాస్యం చేసేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు.

Also Read:

మేడారం జాతర ఎప్పటినుంచంటే.. వివరాలివే..

మావోయిస్టులకు బిగ్ షాక్.. ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతం..?

Advertisment
Advertisment
తాజా కథనాలు