LIVE: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు... కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణలో 20 లక్షల మేర పంట ఎండిపోయిందని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఎద్దేవా చేశారు. దొంగ మేనిఫెస్టో పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. By V.J Reddy 05 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS Chief KCR: తెలంగాణలో ఎండిన పొలాలను పరిశీలిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ క్రమంలో ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. అనంతరం సిరిసిల్లలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాలు మేర పంట ఎండిపోయిందని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ఫైర్ అయ్యారు. నీటిని వాడే విధానం తెలియని ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. పంటలు ఎండడానికి రెండో కారణం కరెంట్ కోతల సమస్యలు అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో కరెంట్ కోతలు ఉండేవి కాదని.. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందించి రైతులను అండగా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. ఆనాటి కరువు రోజులను తెచ్చిందని ఫైర్ అయ్యారు. అందుకే సైలెంట్ గా ఉన్న.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేసీఆర్. కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలని గత నాలుగు నెలలుగా నేను సైలెంట్ గా ఉన్నానని.. నోరు తెరవాలేదని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ తమకు 48 గంటల సమయం ఇచ్చారని... కానీ, తాము 4 గంటల్లోనే రైతుల ఆత్మహత్యల వివరాలు ఇచ్చామని అన్నారు. పరిహారం ఇవ్వకపోతే రైతుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు. మిమ్మల్ని వదిలిపెట్టం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు మాజీ సీఎం కేసీఆర్. డిసెంబర్ 9వ తేదీన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని.. రుణమాఫీ సంగతి ఏమైందని? అని ప్రశ్నించారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం వచ్చేలా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం క్వాలిటీ కరెంట్ ఇవ్వట్లేదని.. రైతులకు ఇప్పటికి రైతు బంధు సాయం అందలేదని అన్నారు. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దళిత బంధు కోసం దళిత సోదరులు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం యాదవులను, దళితులను, రైతులను, మహిళలను, పెన్షన్ దారులను మోసం చేసిందని మండిపడ్డారు. కొత్త రేషన్ కార్డుతో ఈ ప్రభుత్వం అందరిని మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అయిందని అన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ కింది వీడియోలో చూడండి.. #kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి