KCR: ఎన్నికల ప్రచారంపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం TG: కేసీఆర్ తన బస్సు యాత్రను రీషెడ్యూల్ చేసుకున్నారు. ఈసీ తనను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధాన్ని విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు రాత్రి 8 గంటల నుంచి తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. 10వ తేదీ వరకు బస్సు యాత్రను కొనసాగించనున్నారు. By V.J Reddy 02 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS Chief KCR: ఎన్నికల ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధాన్ని ఎన్నికల సంఘం తనపై విధించడంపై మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన బస్సు యాత్ర షెడ్యూల్ ను మార్చుకున్నారు. రేపు (3న) సాయంత్రం 8 గంటలకు ఈసీ విధించిన నిషేధం గడువు ముగియనుంది. 8 గంటల తరువాత తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ షురూ చేయనున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర రీషెడ్యూల్.. * 03.05.2024 నాడు సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండం లో రోడ్డు షో * 04.05.24 నాడు సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో * 05.05.24 సాయంత్రం జగిత్యాల రోడ్డు షో * 06.05.24 సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో * 07.05.24 నాడు కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో * 08.05.24 నాడు నర్సాపూర్ రోడ్డు షో అనంతరం పటాన్లో చెరు రోడ్డు షో * 09.05.24 నాడు కేసీఆర్ బస్సు యాత్ర కరీంనగర్ చేరుకుంటుంది అదే రోజు సాయంత్రం కరీంనగర్ లో రోడ్డు షో * 10.05.24 చివరి సిరిసిల్లలో రోడ్డు షో నిర్వహించనున్నారు. అనంతరం సిద్దిపేట లో బహిరంగసభలో తన చివరి ఎన్నికల ప్రసంగాన్ని చేయనున్నారు. అసలేం జరిగింది? మాజీ సీఎం కేసీఆర్ కు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. సిరిసిల్లలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా “అవమానకరమైన, అభ్యంతరకరమైన ప్రకటనలు” చేసినందుకు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. కాగా మాజీ సీఎం కేసీఆర్ పై ఇటీవల కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వగా.. ఆయన స్పందించక పోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. #brs #kcr #ec మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి