KCR : కేసీఆర్ కు సర్జరీ సక్సెస్.. యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ కు ఈరోజు వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. కేసీఆర్ కు 6 నుంచి 8 వరాల వరకు రెస్ట్ అవసరమని తెలిపారు. By V.J Reddy 08 Dec 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి KCR Surgery Success : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) కు సర్జరీ విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. యశోద ఆసుపత్రిలో వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు. కేసీఆర్(KCR) ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ALSO READ: నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి ఈ రోజు ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బాత్ రూంలో జారిపడటంతోనే కేసీఆర్ కు గాయం జరిగినట్లు పేర్కొన్నారు. ఎడమ తుంటికి ఫ్యాక్చర్ అయిందని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. కేసీఆర్ కోలుకోవడానికి 6-8 వారాలు పడుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా కేసీఆర్ గాయపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని ఆందోళనకు గురయ్యానని చంద్రబాబు తెలిపారు. త్వరగా, సంపూర్ణంగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, సీఎం జగన్ తదితర నేతలు కేసీఆర్ తొందరగా కోలుకోవాలని అన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యంపై అరా తీశారు. యశోద ఆసుపత్రిలో భద్రతా పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యంపై ప్రతీ అప్డేట్ ఇవ్వాలని వైద్యులను కోరారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని… — Revanth Reddy (@revanth_anumula) December 8, 2023 #kcr-health-update #telugu-latest-news #kcr-surgery-success మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి