BRS News: మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్, గోషామహల్ నుంచి నందకుమార్ వ్యాస్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.

New Update
BRS News: మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ (BRS Party) అభ్యర్థులను ప్రకటించింది. నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్, గోషామహల్ నుంచి నందకుమార్ వ్యాస్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఈ ఇద్దరితో మొత్తం 119 స్థానాలకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది బీఆర్ఎస్. ఎన్నికల షెడ్యూల్ కు చాలా ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ఒకే సారి 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ సమయంలో హైదరాబాద్ లోని గోషామహల్, చార్మినార్  నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టికెట్లను పెండింగ్ లో పెట్టారు కేసీఆర్ (CM KCR). అయితే.. మల్కాజ్ గిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: బీసీలకు అవకాశం రాలేదు, టికెట్ వచ్చిన కాడ గెలిపించండి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

దీంతో ఆ స్థానాన్ని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి కేటాయించారు కేసీఆర్. జనగామకు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ కు సునీతా రెడ్డి పేర్లను ఖరారు చేసి వాళ్లకు బీఫామ్ లను సైతం అందించారు. తాజాగా మిగిలిన మరో రెండు స్థానాలకు సైతం అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది.  అయితే.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ అభ్యర్థిని బీఆర్ఎస్ మారుస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ స్థానానికి అబ్రహం పేరును కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటించారు. కానీ బీఫామ్ మాత్రం ఆయనకు ఇంత వరకు అందించలేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అబ్రహం అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే అభ్యర్థిని మార్చాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు