Health Tips : రాత్రి పూట నోటితో శ్వాస తీసుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

మనం శ్వాస తీసుకునే పద్దతిని బట్టి కూడా మన ఆరోగ్యం గురించి అంచనా వేయోచ్చని నిపుణులు అంటున్నారు. నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంటే మాత్రం అనారోగ్యానికి కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముక్కుతో శ్వాస తీసుకోవడం వల్ల బరువు వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.

New Update
Health Tips : రాత్రి పూట నోటితో శ్వాస తీసుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

Breathing Problems : శ్వాస(Breathing) తీసుకోవడం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. మనం ఊపిరి పీల్చుకున్నంత కాలం మాత్రమే సురక్షితంగా ఉంటామని మనందరికీ తెలిసిన విషయమే. శ్వాస ఆగింది అంటే ఆ జీవం ఇక లేదనే చెప్పవచ్చు. ఊపిరి పీల్చుకోవడం అనేది ప్రతి ఒక్కరూ చేసే పనే.

కానీ ఎలా పీల్చుకుంటున్నారు అనేదే ఆలోచించాల్సిన విషయం. ఊపిరితిత్తుల(Lungs)కు ఆక్సిజన్(Oxygen) చేరుకోవడానికి రెండు వాయు మార్గాలు ఉన్నాయి, ఒకటి మన నోరు, మరొకటి ముక్కు. చాలా మంది ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటారు, కానీ కొంతమంది నోటి ద్వారా కూడా శ్వాస తీసుకుంటారు.

చాలా సార్లు ఇది ముక్కు(Nose) మూసుకుపోవడం(Blocking) వల్ల కూడా జరుగుతుంది. అయితే కొందరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు నోటితో శ్వాస తీసుకుంటారు. ఇది ప్రమాదకరమైనది అని చెప్పవచ్చు. అవును, నోటి శ్వాస అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీన్ని తేలికగా తీసుకోకూడదు. నోటి శ్వాస వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో, ఆరోగ్యానికి ఎందుకు హానికరమో తెలుసుకుందాం?

నోటి శ్వాస కారణంగా
స్లీప్ అప్నియా, ముక్కు దిబ్బెడ, టాన్సిల్స్‌ ఇబ్బందులు, ముక్కు పాలిప్స్‌, అధిక ఒత్తిడి, ఆందోళన, చాలా అలసట ఇటువంటి సందర్భాల్లో చాలా మంది ముక్కుతో శ్వాస పీల్చుకుంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కోరి ప్రమాదాలను తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోటి శ్వాస ఎందుకు ప్రమాదకరం?

నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు, గాలి ఫిల్టర్ చేయకుండా నేరుగా లోపలికి వెళుతుంది. అటువంటి పరిస్థితిలో, అధికంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది.నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ సమతుల్యత దెబ్బతింటుంది. దీని కారణంగా రక్తం యొక్క PH స్థాయి కూడా చెదిరిపోతుంది.

మన నోటికి ఎలాంటి రక్షణ వ్యవస్థ లేదు. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు త్వరగా నయమవుతాయి. వ్యాయామం చేసేటప్పుడు నిరంతరం మీ నోటి ద్వారా శ్వాస తీసుకుంటే, బరువు తగ్గడం కష్టం. అయితే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల ఊబకాయం వేగంగా తగ్గుతుంది.

ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు

నిద్రపోతున్నప్పుడు మన శరీరం రికవరీ మోడ్‌లోకి వెళుతుంది. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే, శరీర వ్యవస్థ సులభంగా విశ్రాంతి , డైజెస్ట్ మోడ్‌కు మారుతుంది. జీర్ణక్రియ బాగా జరిగి, శరీరం ఫిట్‌గా ఉన్నప్పుడు బరువు వేగంగా తగ్గుతుంది. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది.

Also read: అమ్మమ్మల కాలం నాటి కండీషనర్‌ ని వాడి..జుట్టుని మృదువుగా చేసుకుందామా!

Advertisment
Advertisment
తాజా కథనాలు