గజ్వేల్‌లో ఉద్రిక్తత.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును గజ్వేల్‌కు వెళ్తుండగా హకీంపేట్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఇరువర్గాల మధ్య పరస్పరం ఘర్షణ ఏర్పడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. అయితే గజ్వేల్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Shareef Pasha 05 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కు బయలుదేరిన రఘునందన్‌ను, హకీంపేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రఘునందన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రఘునందన్‌రావు అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు సంఘటనాస్థలానికి భారీగా పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతమంతా కార్యకర్తలతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సైతం సంఘటనలోనే ఉన్నారు. దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుని హకింపెట్ దగ్గర అరెస్టు చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గజ్వేల్ కి వెళ్తుండగా ప్రివెంట్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గజ్వేల్ లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ఘటనలో గాయపడ్డ సందీప్‌ని పరామర్శించడానికి వెళ్తుండగా అచ్చంపేట వద్ద అల్వాల్ పోలీసులు రఘునందన్‌రావును అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి