Brain Controlling Remote: మనిషి మైండ్ ని కంట్రోల్ చేసే రిమోట్.. శాస్త్రవేత్తలు త్వరలోనే మరో కొత్త ఇన్నోవేషన్‌ను తీసుకురానున్నారు. మనిషి మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే టీవీ లాగా మనిషి బ్రెయిన్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు. By Lok Prakash 28 Jul 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Brain Controlling Remote: టీవీ ఛానెళ్లను మార్చినంత త్వరగా రిమోట్ ద్వారా దూరం నుంచి ఇతరుల మెదడును నియంత్రించడం అనేది చాలా కాలంగా వస్తున్న సైన్స్ ఫిక్షన్ థీమ్. దీన్ని జన్యుశాస్త్రం, న్యూరోసైన్స్‌లోని పరిశోధనలు నిజం చేస్తున్నాయి. ఇటీవలే సౌత్ కొరొయాలో శాస్త్రవేత్తలు మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. కొరియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్‌కు సంబంధించిన సైంటిస్టులు.. అయస్కాంత క్షేత్రం ద్వారా దూరం నుంచే మెదడును కంట్రోల్ చేస్తూ, మ్యాన్యుప్లేట్ చేయగలిగే ఒక పరికరాన్ని కనిపెట్టారు. అంతే కాదు ఆడ ఎలుకలో మాతృత్వాన్ని ప్రేరేపించే లక్షణాలపై ఈ టెక్నాలజీని వారు అప్లై చేసి చూసారు. దీంతోపాటుగా ఆకలిని తగ్గించేందుకు, మెదడును ప్రాసెస్ చేసేందుకు కూడా ఈ ప్రయోగాన్ని ఉపయోగించారు. అయితే ఈ క్రమంలోనే ఎలుక 10% తన బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా మాగ్నెటిక్ ఫీల్డ్‌ను ఉపయోగించి మెదడులోని కొన్ని రీజియన్స్‌ను మాత్రమే కంట్రోల్ చేయగలిగే పరికరాన్ని కనిపెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ పరికరానికి నానో మైండ్ (Nano Mind) అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. దీని వాడడం వల్ల మెదడులోని కొన్ని ప్రాంతాల్లో మార్పులను గమనించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీన్ని హెల్త్ కేర్ అప్లికేషన్స్‌లో వినియోగించేందుకు మరిన్ని ప్రయోగాలను చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. Also Read:Paris Olympics: బ్యాడ్మింటన్‌లో శుభారంభం..రెండో రౌండకకు లక్ష్యసేన్ వినడానికి ఇదో సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తున్నా.. బ్రెయిన్‌ని కంట్రోలింగ్ చేయగలిగే రిమోట్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకొస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది ఇలా ఉంటే..ఇంకో పక్క న్యూరాలింక్ సంస్థ మనిషి మెదడును కంప్యూటర్‌లకు కనెక్ట్ చేసి, సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించే బ్రెయిన్ చిప్‌లను తయారుచేస్తోంది. #brain-controlling-remote మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి