Brahmamudi Serial : కావ్యకు బిగ్ షాక్.. గర్ల్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన రాజ్.. ఆమె ఏం చేయనుంది.? కావ్యకు బిగ్ షాక్ తగులుతుంది. భర్త రాజ్ తన గార్ల్ ఫ్రెండ్ తో ఐస్‌క్రీం తింటూ అడ్డంగా దొరికిపోతాడు. మరోవైపు హీరోయిన్ చెల్లి అప్పు ప్రేమించిన కళ్యాణ్ ను మరిచిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. By Jyoshna Sappogula 04 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Today Serial Episode: తమ్ముడు కళ్యాణ్ చెప్పడంతో అందరి ముందు హీరో రాజ్ భార్య కావ్యకు ప్రపొజ్ చేస్తాడు. ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ కావ్య అంటూ నుదటిపై ముద్దు పెడతాడు. ఇలా ఎపిసోడ్ మొదలవుతుంది. అయితే, ఉదయాన్నే రాజ్ ఆఫీస్ లో అర్జెంజ్ వర్క్ ఉందని హడావిడిగా ఇంటి నుండి ఆఫీస్ కు బయలు దేరుతాడు. అయితే, రాజ్ వెళ్లింది ఆఫీస్ కు కాదు. గర్ల్ ఫ్రెండ్ ను కలిసేందుకు వెళతాడు. అయితే, కావ్య తన పుట్టింటికి వెళ్లడానికో ఏమో అటు వైపు వెళ్లుతుంది. భర్త రాజ్ ను బయట చూసి షాక్ అవుతుంది. రాజ్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఐస్ క్రీం తింటూ ఆమెతో చనువుగా ఉంటాడు. వెంటనే భర్త రాజ్ కు ఫోన్ చేసి ఎక్కడా ఉన్నారు అని అడుగుతుంది. రాజ్ తడబడుతూ ఎక్కడ ఉంటాను అంటుండగా ఆఫీస్ లో ఉన్నారా? అంటే అవును అంటాడు. మరి ట్రాఫిక్ సౌండ్ ఎందుకు వస్తుంది అని అడుగుతుంది? విండో తెరుచుకున్నాను నీకెందుకు అంటూ కాల్ కట్ చేస్తాడు. దీంతో కావ్య అయోమయంలో పడుతుంది. ఇంతకు భర్త రాజ్ తో ఉన్న ఆమె ఎవరూ? గతంలో రాజ్ లవ్ చేశాడా? ఇలా కావ్య తనలో తాను అనుకుంటూ ఉంటుంది. మరో వైపు కావ్య చెల్లి అప్పు ప్రేమించిన కళ్యాణ్ ను మరిచిపోలేక పనూలు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే, కళ్యాణ్ ను మరచిపోలేక ఏడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా కళ్యాణ్ అనామిక లకు ఫస్ట్ నైట్ ఏర్పట్లు చేస్తుంటారు కుటుంబసభ్యులు. అనామిక ఏమో కావ్యను టార్గెట్ చేస్తూ మాటలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. Also Read: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఎట్టకేలకు బేబీ బంప్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ #brahmamudi-serial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి