Brahmamudi Serial: అత్తారింట్లో అడుగుపెట్టకముందే చేలరేగిపోతున్న అనామిక..కావ్య ఏం చేయనుంది.?

బ్రహ్మముడి సీరియ‌ల్‌ లో దుగ్గిరాల ఫ్యామిలీ తోపాటు అనామిక ఫ్యామిలీ కావ్యను బాగా తిట్టిపడేస్తున్నారు. అనామిక అయితే ఇంటికి వచ్చిన మొదటి రోజే కావ్యను తీసిపడేస్తుంది. కావ్య హారతి ఇస్తే నేను ఇంట్లోకే రాను అంటూ తేల్చి చెబుతుంది.

New Update
Brahmamudi Serial: అత్తారింట్లో అడుగుపెట్టకముందే చేలరేగిపోతున్న అనామిక..కావ్య ఏం చేయనుంది.?

Brahmamudi Serial Today Episode: ఎన్నో గొడవల మధ్య క‌ళ్యాణ్‌, అనామిక పెళ్లి జరిగింది. అప్పు కళ్యాణ్ ను ప్రేమిస్తుందని.. కావ్య తన చెల్లికి కళ్యాణ్ ను ఇచ్చి ప్లాన్ చేస్తుందని అందరూ అపర్థం చేసుకుంటూ కావ్యను ఘోరంగా అవమానిస్తూ ఉంటారు. త‌న త‌ల్లిదండ్రుల‌కు అవ‌మానం జ‌ర‌గ‌డంతో కావ్య క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. మా వల్ల నువ్వు ఇబ్బంది పడకు కావ్య అంటూ క‌న‌కం, కృష్ణ‌మూర్తి వెళ్లిపోతారు. మొన్నటి వరకు కొడలిని ఎంతో ప్రేమగా చూసుకున్న ధాన్య‌ల‌క్ష్మి కూడా కావ్యపై కూడా బాగా ఫైర్ అవుతుంది. క‌న‌కం, కృష్ణ‌మూర్తిని మళ్లి మా ఇంటి రాకండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

Also Read: ఫ్రీ బస్ ఎఫెక్ట్.. జట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.!

Brahmamudi Serial Today Episode

కొత్త‌గా పెళ్లైనా క‌ళ్యాణ్, అనామిక‌ల‌కు హార‌తి ఇవ్వ‌మ‌ని ఇంట్లో వారు చెబుతారు.. కాని, అనామిక తండ్రి దానిని అడ్డుకోవాలని చూస్తాడు. నా కూతురు పెళ్లిని చెడగొట్టడానికి కావ్య ప్రయత్నించింది..అలాంటి తనతో నా కూతురికి హారతి ఇప్పిస్తారా? అంటూ మండిపడుతాడు. అనామిక కూడా త‌న తండ్రి మాట‌ల‌ను స‌మ‌ర్థిస్తు.. కావ్య త‌న చెల్లిలి కోసం పెళ్లి చెడ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నించింద‌ని ఫైర్ అవుతుంది. అత్తారింటికి వచ్చిన మొదటి రోజే కావ్యను మాటలతో ఇబ్బంది పెడుతుంది. కావ్య హారతి ఇస్తే తాను ఇంట్లో రానని తేల్చి చెబుతుంది.

అయితే, భర్త రాజు మాత్రం కావ్యకు సపోర్ట్ చేస్తాడు..ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం కావ్య అని ఇలా తనను అవమానిస్తూ మాట్లాడం కరెక్ట్ కాదని అనామిక‌ ఫ్యామిలీని హెచ్చరిస్తాడు. దీంతో, అనామిక తండ్రి.. రాజు తనకు డబ్బులు ఇవ్వాలి అని.. ఒకవేళ అడ్డం తిరుగుతే డబ్బు ఇవ్వడని కూతురికి నచ్చ జెప్పి..కావ్య చేతితో హారతి ఇప్పించేలా చేస్తాడు. తరువాత కూతురికి బాగా నూరిపోస్తుంది అనామిక తల్లి.. భర్తను ముందుగా గుప్పట్లో పెట్టుకోవాలని అంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు