Brahmamudi Serial : ఇంట్లో పొట్టి బట్టలు వేసుకొని స్వప్న మోడలింగ్ .. కోడలి పై రెచ్చిపోయిన రుద్రాణి.. సపోర్ట్ గా దుగ్గిరాల ఫ్యామిలీ

మోడలింగ్ కోసం స్వప్న ఇంట్లోనే ఫోటో షూట్ మొదలు పెడుతుంది. ఇది చూసిన రుద్రాణి దుగ్గిరాల కుటుంబం పరువు తీస్తున్నావని కోడలి పై రెచ్చిపోతుంది. మరో వైపు కావ్య పుట్టింటిని అవమానిస్తారు అనామిక, ధాన్యలక్ష్మి. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial : ఇంట్లో పొట్టి బట్టలు వేసుకొని స్వప్న మోడలింగ్ .. కోడలి పై రెచ్చిపోయిన రుద్రాణి.. సపోర్ట్ గా దుగ్గిరాల ఫ్యామిలీ

Brahmamudi Serial Today Episode : స్వప్న(Swapna) క్రెడిట్ కార్డు బిల్(Credit Card Bill) కట్టడానికి అత్త రుద్రాణి(Rudhrani) ని డబ్బులు అడగడంతో.. లేవని తెగేసి చెప్తుంది. దీంతో డబ్బుల కోసం ఒకరితో చేయి జాచడం ఎందుకని ఫీలైన స్వప్న మోడలింగ్ చేయాలనీ డిసైడ్ అవుతుంది.

Swapna
ఉదయాన్నే స్వప్న మోడ్రన్ డ్రెస్ వేసుకొని మోడలింగ్ కోసం ఇంట్లోనే ఫోటో షూట్ చేయించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అత్త రుద్రాణి.. ఎవరిని అడిగి ఈ పని చేస్తున్నావు.. ఇంట్లో వాళ్ళు మోడలింగ్ వద్దని చెప్పారు కదా అని కోడలి పై రెచ్చిపోతుంది. నీ కొడుకు కోట్ల ఆస్తి కూడబెడుతుంటే సరిపోక మోడలింగ్(Modelling) చేస్తున్నాను అని వెటకారం చేస్తుంది స్వప్న. నా అవసరాలు నేను చూసుకోవాలి కదా అందుకే మోడలింగ్ చేస్తున్నాను అని చెప్తుంది.

Also Read : Balakrishna: గాలికి విగ్‌ ఊడింది.. కోపంతో ఊగిపోయిన బాలయ్య ఏం చేశాడంటే?

Rudhrani
కోడలి మాటలకు ఒళ్ళు మండిపోయిన రుద్రాణి.. ఇంట్లోకి వెళ్లి అందరినీ పిలుస్తుంది. స్వప్న పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయడం చూసి షాక్ అవుతారు. ఛాన్స్ దొరికిందని ధాన్యలక్ష్మి(Dhanyalakshmi) కూడా స్వప్న పై రెచ్చిపోతుంది. దుగ్గిరాల ఇంటి పరువు తీస్తుంది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.

Duggirala Family

మరో వైపు భార్య ప్రవర్తనతో జెలసీగా ఫీల్ అవుతున్న రాజ్(Raj) ఎలాగైనా కావ్యను.. తన బావ నుంచి దూరం చేయాలనీ ఆలోచిస్తాడు. ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చినట్లు నటించి కావ్యను పుట్టింటి నుంచి తీసుకెళ్తాడు.

Raj
ఇక స్వప్న పంచాయితీ జరుగుతుండగానే కావ్య(Kavya), రాజ్(Raj) ఇద్దరు ఇంటికి వస్తారు. అసలు ఏదైనా చేసే ముందు చెప్పి చేయాలి కదా అని స్వప్నను నిలదీస్తుంది అపర్ణ. దీంతో స్వప్న మా అత్త, నా భర్త డబ్బులివ్వమంటే చేతులెత్తేశారు. డబ్బు అవసరముంటే పుట్టింటి నుంచి తెచ్చుకోవాలని చెబుతున్నారు.. అందుకే నా అవసరాల కోసం మోడలింగ్ చేస్తున్నాను అని చెప్తుంది. వెంటనే ధాన్యలక్ష్మి అదేంటి వాళ్లే ఇక్కడ నుంచి దోచుకుతింటున్నారు కదా అని వెటకారం చేస్తుంది.

Raj - Kavya
ఇది విన్న కావ్య ఇక్కడ నుంచి ఎవ్వరూ దోచుకోవట్లేదు.. వాళ్ళ సొంత కష్టంతో బ్రతుకుతున్నారు అంటూ ధాన్యలక్ష్మీ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. అనామిక కూడా కావ్య కుటుంబాన్ని అవమానించడంతో రాజ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.

Kavya - Danyalakshmi
ఆ తర్వాత స్వప్న బాధను అర్థం చేసుకున్న ఇందిరాదేవి, సుభాష్ .. ఆమె సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిస్తాము అని చెప్తారు. స్వప్న కూడా వాళ్ళ మాటలను అంగీకరించి మోడలింగ్ కార్యక్రమాన్ని ఆపేస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Indira Devi - Subhash

Also Read : Hero: తండ్రైన మరో టాలీవుడ్ యంగ్ హీరో.. పాప పేరు కూడా రివీల్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు