Brahmamudi Serial: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన 50 లక్షలు.. ప్రకాశం పై రెచ్చిపోయిన సుభాష్.. రాజ్ కు షాకిచ్చిన కావ్య కుటుంబం

ప్రకాశం మతిమరుపు కారణంగా ఆఫీస్ లో 50 లక్షలు నష్టం వచ్చిందని.. తమ్ముడి పై విపరీతంగా ఫైర్ అవుతాడు సుభాష్. భర్తకు అవమానం జరగడం తట్టుకోలేని ధాన్యలక్ష్మీ సుభాష్ పై అరుస్తుంది. మరో వైపు అత్తారింట్లో భార్య కోసం తిప్పలు పడుతుంటాడు రాజ్. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

New Update
Brahmamudi Serial:  అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన 50 లక్షలు.. ప్రకాశం పై రెచ్చిపోయిన సుభాష్.. రాజ్ కు షాకిచ్చిన కావ్య కుటుంబం

Brahmamudi Serial: రాజ్ కావ్యతో పాటు ఉండడానికే వచ్చాడని ముందే తెలిసిన కావ్య అమ్మ కనకం.. మీరు ఎలాగో మా ఇంట్లో ఉండరు. కనీసం కాఫీ అయిన తాగేసి వెళ్ళండి అంటూ రాజ్ తో వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో కావ్య.. అయ్యో అమ్మ.. ఆయన కూడా.. నాతో పాటు ఇక్కడే ఉండడానికి వచ్చారు అని ఏమీ తెలియనట్లు కవర్ చేస్తుంది. publive-image
మరో వైపు ప్రకాశం మతిమరుపు కారణంగా ఆఫీస్ లో 50 లక్షలు నష్టం వచ్చిందని.. తమ్ముడి పై విపరీతంగా ఫైర్ అవుతాడు. ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా అని తిడతాడు. భర్తను అలా అవమానించడం తట్టుకోలేకపోయిన ధాన్యలక్ష్మి బావ సుభాష్ పై అరుస్తుంది. ఆయనేమైనా మీ బానిసా..? చిన్నపిల్లాడిలా అలా తిడుతున్నారు. ఆయనకు పెళ్ళై.. పిల్లలకు కూడా పెళ్లయింది.. అందరి ముందు ఇలా అవమానించడం బాగాలేదు అని సుభాష్ పై సీరియస్ అవుతుంది.

publive-image
ధాన్యలక్ష్మి మాటలకు చిన్నబోయిన సుభాష్.. కోపం అరిచేశాను నన్ను క్షమించు తమ్ముడు అంటూ సుభాష్ కి సారీ చెప్తాడు. అన్నదమ్ములు క్షమాపణలు చెప్పుకోవడంతో.. ధాన్యలక్ష్మి పై అపర్ణ సీరియస్ అవుతుంది. ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా ఎప్పుడూ కలిసి ఉండే వాళ్ళు నీ వల్ల క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది అని ధాన్యలక్ష్మి పై కోప్పడి వెళ్ళిపోతుంది.

publive-image

భార్య.. తన అన్నయ్యను అలా నిలదీయడం నచ్చని ప్రకాశం ధాన్యలక్ష్మి పై కోప్పడతాడు. మిమల్ని అలా అవమానిస్తుంటే ఎలా ఊరుకుంటాను అని అంటుంది.

publive-image

మరో వైపు ఇంటికి వచ్చిన మేనల్లుడి కోసం అరిటాకు పై రకరకాల చేస్తుంది కనకం. ఆ వంటకాలన్నీ చూసి.. ఫుల్ గా తినేయాలని వెళ్తాడు రాజ్. కానీ రాజ్ ఉడికించాలని నిర్ణయించుకున్న కావ్య ఫ్యామిలీ.. ఇవ్వన్నీ నీకోసం కాదు అల్లుడు గారు.. మా మేనల్లుడు కోసం అని షాకిస్తారు. దీంతో రాజ్ ఇరిటేట్ అవుతాడు.

publive-image
కావ్య బావను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలని ఫిక్స్ అయిన రాజ్.. మీ మేనల్లుడు ఇప్పుడే గేదెలా ఉన్నాడు.. త్వరగా పెళ్లి చేసి అమెరికా పంపించండి అని అంటాడు. దీంతో కావ్య బావ.. నాకు కావ్యాల నవ్వే అమ్మాయి కావాలి, కావ్యలా ప్రేమించే అమ్మాయి కావాలి అంటూ కావ్య భజన చేస్తాడు. భార్య పేరు చెప్తుంటే జెలసీగా ఫీలైన రాజ్.. ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Ram Charan-NTR: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రామ్ – భీమ్.. ఇద్దర్నీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు