Brahmamudi Serial: అత్త నిర్ణయానికి ఎదురుచెప్పిన కావ్య.. కొడుకు పై కోపంతో రగిలిపోతున్న అపర్ణ...! రాజ్ ఏం చేయనున్నాడు..?

దుగ్గిరాల కుటుంబం అంతా కలిసి రాజ్ ను వెలివేస్తుంది. అతను భోజనం చేయడానికి రాగానే తల్లి అపర్ణ కోపంగా లేచి వెళ్ళిపోతుంది. దీంతో రాజ్ కూడా భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు. మరో వైపు కావ్య భర్తకు సపోర్ట్ చేయడం ఇష్టం లేని అపర్ణ ఆమెను అడ్డుకుంటుంది. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: అత్త నిర్ణయానికి ఎదురుచెప్పిన కావ్య.. కొడుకు పై కోపంతో రగిలిపోతున్న అపర్ణ...! రాజ్ ఏం చేయనున్నాడు..?

Brahmamudi Serial: రాజ్ చేసిన తప్పు కారణంగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అతని పై కోపంగా ఉంటారు. రాజ్ తో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఇక ఇంట్లో అందరు డిన్నర్ చేయడానికి కూర్చుంటారు.. ఇంతలో రాజ్ కూడా భోజనం చేయడానికి వస్తాడు.

publive-image
దుగ్గిరాల ఇంటి పరువు తీసాడని కొడుకు పై కోపంగా ఉన్న అపర్ణ.. అతడు రాగానే భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో రాజ్ తల్లి చేయి పట్టుకొని ఆపుతాడు. ఎదుటివారి పై కోపాన్ని భోజనం పై చూపించకూడదని నువ్వే చెప్పావు కదా అని తల్లికి సర్దిచెప్తాడు. దీనికి అపర్ణ నీలాంటి కొడుకును కన్నందుకు ఇంకా ఎన్ని అవమానాలు భరించాల్సి వస్తుందో.. కడుపు రగిలిపోయి ఆకలి చచ్చిపోయింది అని కొడుకు పై కోప్పడుతుంది.

publive-image

అపర్ణ మాటలకు మనసు ముక్కలైన రాజ్.. నా కారణంగా మీరెందుకు భోజనం మానేయాలి. నేనే ఇక్కడి నుంచి వెళ్లిపోతానని డిన్నర్ చేయకుండా రూమ్ లోకి వెళ్తాడు. కొడుకు తినకుండా వెళ్లడంతో బాధను భరించలేకపోయిన అపర్ణ తాను కూడా భోజనం చేయకుండా వెళ్ళిపోతుంది.

publive-image

మరో వైపు భర్త రాజ్ డిన్నర్ చేయకుండా వెళ్లడంతో అతడి కోసం భోజనం తీసుకెళ్లాలని అనుకుంటుంది కావ్య. ఇంతలో అక్కడికి వచ్చిన అపర్ణ ఆమెను అడ్డుకుంటుంది. ఇంట్లో అందరు రాజ్ ను వ్యతిరేస్తుంటే.. నువ్వు మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని హెచ్చరిస్తుంది. వాడి దృష్టిలో మమల్ని చెడ్డవాళ్లను చేసి.. నీకు మాత్రమే వాడి పై ప్రేమ ఉందని నిరూపించుకోవాలని అనుకుంటున్నావా ..? అని కోడలి పై ఫైర్ అవుతుంది.

publive-image

అత్త మాటలకు కావ్య గట్టిగా బదులిస్తుంది. ఆయన బిడ్డ తీసుకురావడం వల్ల మీ అందరి కంటే ఎక్కువ నష్టం నాకే జరిగింది. ఇంట్లో అందరు పట్టించుకోకపోతే.. ఆయన నిజం ఎప్పటికీ చెప్పరు. ఇలాంటి పనుల వల్లనైనా ఆయన నిజం చెప్పే అవకాశం ఉంది అని చెప్తుంది.

publive-image
రాజ్ గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాజ్ కోసం భోజనం తీసుకొస్తుంది కావ్య. రాజ్ మాత్రం తనకు ఆకలిగా లేదని చెప్తాడు. దీంతో కావ్య.. ఇప్పటివరకు చూపించిన అహంకారం చాలు.. మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు నోరు మూసుకొని తినండి అని భర్తను దబాయిస్తుంది. ఇక రాజ్ భోజనం చేస్తాడు.

publive-image
భర్త భోజనం చేసిన తర్వాత బిడ్డ గురించి మళ్ళీ నిలదీస్తుంది కావ్య. ఇంట్లో వాళ్ళను ఎందుకు బాధపెడుతున్నారని అడుగుతుంది. దీనికి రాజ్ నాకు ఇంకో దారి లేదని బదులిస్తాడు. కనీసం ఆ బిడ్డకు తల్లెవరో చెప్పమని ప్రశ్నిస్తుంది . కానీ రాజ్ మాత్రం సమాధానం చెప్పకుండా పడుకుంటాడు.

publive-image
మరో వైపు ఆకలితో అల్లాడిపోతున్న అనామిక, రుద్రాణి, ధాన్యలక్ష్మి, రాహుల్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆర్డర్ పెట్టుకుంటారు. తీరా ఆర్డర్ తీసుకుందామని వెళ్ళేలోపు అక్కడ ప్రకాశం ఉంటాడు. దీంతో షాకవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Suma Kanakala Holi: హోలీ రోజు గుడ్లు, టమోటోలతో.. యాంకర్ సుమ చేసిన పని చూస్తే షాకవుతారు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు