Brahmamudi : అసలు మాయను చంపేసిన రుద్రాణి ..! భర్తకు శాశ్వతంగా దూరమవుతున్న కావ్య..! చిత్రతో రాజ్ పెళ్లి..!

అసలు మాయను రుద్రాని కారుతో యాక్సిడెంట్ చేస్తుంది. మరో వైపు మాయ పరిస్థితిని చూసిన కావ్యలో భయం మొదలవుతుంది. నిజం బయపెట్టకుండా మాయ చనిపోతే.. తాను రాజ్ కు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందని కనీళ్ళు పెట్టుకుంటుంది కావ్య. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

New Update
Brahmamudi : అసలు మాయను చంపేసిన రుద్రాణి ..! భర్తకు శాశ్వతంగా దూరమవుతున్న కావ్య..! చిత్రతో రాజ్ పెళ్లి..!

కావ్యను చూసిన నువ్వెంటి ఇక్కడ అన్నట్లుగా షాకవుతుంది. దీంతో కావ్య ఇప్పుడు పరిచయాలు అనవసరం.. ఇప్పుడు కావాల్సింది కేవలం నిజాలు మాత్రం. ఇప్పటివరకు నువ్వు చేసిన మోసాలు అన్నింటి గురించి బయటపెట్టాల్సిందే అని మాయను బెదిరిస్తోంది కావ్య.

publive-image

ఇక అసలు నిజం బయటపడుతుంది అని భయపడిన మాయ అక్కడి నుంచి పారిపోతుంది. వెంటనే కావ్య, అప్పు కూడా మాయను ఛేజ్ చేస్తూ ఆమె వెనకాల పరుగెడతారు.

publive-image

ఇందంతా చాటుగా గమనించిన రుద్రాణి (Rudhrani) .. ఎట్టి పరిస్థితుల్లో కావ్యకు అసలు మాయ దొరకకూడని ప్లాన్ చేస్తుంది. మాయ కావ్య చేతికి దొరికి సమయానికి ఆమెను కారుతో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది.

publive-image

మాయకు యాక్సిడెంట్ కావడంతో వెంటనే ఆమెను హాస్పిటల్ జాయిన్ చేస్తారు కావ్య, అప్పు. ఇక కావ్య మాత్రం ఏడుస్తూ ఉంటుంది. దీంతో అప్పు .. మాయకు యాక్సిడెంట్ అయితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అక్క. అది చేసిన పాపాలకు దేవుడు సరైన శిక్ష వేసాడు అనుకో అని కావ్యతో అంటుంది అప్పు.

publive-image

ఇక కావ్య శిక్ష పడింది మాయకు కాదు నాకు అంటూ అప్పుతో బాధపడుతుంది. ఇప్పుడు మాయకు ఏదైన జరిగితే.. అసలు నిజమేంటో ఎవరికీ తెలియకుండా పోతుంది. అప్పుడు మా అత్తయ్య గారు నా భర్తకు , ఆ దొంగ మాయతో పెళ్లి చేస్తారు. రేపే ముహూర్తం కూడా పెట్టారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

publive-image

ఇంతలో డాక్టర్ వస్తుంది. డాక్టర్ రాగానే మాయ పరిస్థితి ఎలా ఉందని అడుగుతుంది కావ్య దీంతో ఆమె పరిస్థితి చాలా సీరియస్ ఉందని చెప్పడంతో కావ్య కంగారు పడుతుంది. మరి మాయ బ్రతికి నిజం బయటపెడుతుందా..? లేదా..? అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది.

publive-image

Also Read: Pawan Kalyan: 'ధర్మం దే విజయం'... వైరలవుతున్న 'హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్   - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు