Brahmamudi: చిక్కుల్లో పడిన కావ్య.. నిజం బయటపెట్టిన రాజ్..! కళ్యాణ్ కు షాక్..! ధాన్యలక్ష్మి కొడుకు కళ్యాణ్ కు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. మరో వైపు కావ్య ఈ సమయంలో కళ్యాణ్ కు పెళ్లి చేయడం సరైనది కాదని చెబుతుంది. దాంతో ధాన్యలక్ష్మి కావ్య పై లేనిపోని ఆరోపణలు చేస్తుంది. కళ్యాణ్-అప్పును ఒకటి చేయాలని ఈ పెళ్ళికి అడ్డుపడుతున్నావు అంటూ కావ్యను నిందిస్తుంది. By Archana 26 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Brahmamudi Serial: కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడు అని కనిపెట్టిన రుద్రాణి ధాన్యలక్ష్మి మనసులో విషం నింపాలని చూస్తుంది. ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి తనకు తెలిసిన అమ్మాయి ఉంది. కళ్యాణ్ ను పెళ్లి చేసుకోవడం వాళ్లకు ఒకే. ఒకసారి నువ్వు మాట్లాడితే సరిపోతుంది అని చెబుతుంది రుద్రాణి. దీంతో ధాన్యలక్ష్మి ఇప్పుడు పెళ్లంటే వాడు ఒప్పుకుంటాడా అని అంటుంది. దానికి రుద్రాణి నువ్వు ఇలాగె సైలెంట్ గా ఉంటే కావ్యను తన చెల్లి అప్పును కల్యాణ్‌కు భార్యగా తీసుకొస్తుంది అని ధాన్యలక్ష్మికి లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొడుతుంది. మరో వైపు అప్పుకు పెళ్లి ఫిక్స్ అవడంతో సంతోషంగా ఉంటుంది కనకం. ఇక కృష్ణమూర్తి పెళ్ళికి తక్కువ టైం ఉంది.. ఎలా అని కంగారుగా పడతాడు. దీంతో కావ్య , స్వప్న అందంతా మేము చూసుకుంటాము నాన్న మీరు వచ్చి అక్షంతలు వేస్తే సరిపోతుంది అని కృష్ణమూర్తికి భరోసా ఇస్తారు. కృష్ణమూర్తి కూడా తన బిడ్డలను చూసి సంతోషపడతాడు. ఇంతలో అప్పు అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక అప్పు వెళ్ళగానే కావ్య, స్వప్న కూడా తన వెంటే వెళతారు. అప్పు డల్ గా ఉండడం చూసి.. పెళ్లంటే ఇష్టం లేదా..? ఏంటీ అని అడుగుతారు. దానికి అప్పు అలాంటిదేమి లేదు అక్క అని చెప్తుంది. మరో వైపు కళ్యాణ్ అప్పుకు కాల్ చేస్తూ ఉంటాడు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. కళ్యాణ్ మళ్ళీ మళ్ళీ కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే కళ్యాణ్.. పెళ్లి చూపులు జరిగాయంట కదా. అందుకే అవైడ్ చేస్తున్నావా. ఒకసారి మాట్లాడాలి బ్రో అని అంటాడు. ఇక అప్పు సరే కలుద్దాం అని ఒప్పుకుంటుంది. రుద్రాణి మాయలో పడిన ధాన్యలక్ష్మి.. ఆమె చెప్పినట్లుగానే కళ్యాణ్ కు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ విషయాన్ని ఇంట్లో అందరికి చెబుతుంది. ధాన్యలక్ష్మి కళ్యాణ్ కు పెళ్లి చేయాలని చెప్పడంతో ప్రకాశం, ఇందిరాదేవి ఇప్పుడు పెళ్లేంటి అని అడ్డుపడతారు. విడాకులు తీసుకొని రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మరో పెళ్లి చేస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు అని అంటుంది ఇందిరాదేవి. ఇంతలో కావ్య కూడా అక్కడికి వస్తుంది. విషయం తెలియడంతో కావ్య కూడా పెళ్లి వద్దని చెబుతుంది. దానికి ధాన్యలక్ష్మి.. కల్యాణ్ నీకు ప్రియమని మరిది కదా. మరి వాడి మంచికి ఎందుకు అడ్డు పడుతున్నావు. నీ ప్లాన్ వర్క్ అవుట్ కాదనా అంటూ కావ్య పై లేనిపోని ఆరోపణలు చేస్తుంది. ఇక ధాన్యలక్ష్మి ఇలా మాట్లాడడంతో కావ్య షాకవుతుంది. ప్లాన్ ఏంటీ అని అడుగుతుంది. నీ చెల్లి అప్పుతో నా కొడుకుకు పెళ్లి చేయించాలనేది కదా నీ ప్లాన్ అని అంటుంది ధాన్యలక్ష్మి . మీ చెల్లిని ఇంటికి కోడలు చేసి.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుగ్గిరాల కుటుంబాన్ని ఏలుదామనుకుంటున్నారా అని కావ్యను నిందిస్తుంది. ధాన్యలక్ష్మి మాటలకు విసిగిపోయిన కావ్య.. అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా అని ఫైర్ అవుతుంది. దాంతో ధాన్యలక్ష్మి ఏయ్.. మాటలు మర్యాదగా రాని అని అంటుంది. ఇక రెచ్చిపోయిన కావ్య.. మీకేంటి మర్యాదా ఇచ్చేది. నా క్యారెక్టర్‌నే తప్పు పడుతున్నప్పుడు అని ధాన్యలక్ష్మి దుమ్ముదులిపేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో కళ్యాణ్ ను పెళ్ళికి ఒప్పిస్తానని ధాన్యలక్ష్మికి మాటిస్తుంది. మరో వైపు రాజ్ కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడని కావ్యకు షాకిస్తాడు. Also Read: Indra Re-Release: మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. చిరు బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్..! - Rtvlive.com #bramhamudi-serial #bramhamudi-serial-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి