Brahmamudi Serial: అనామిక నిజస్వరూపం బయట పడింది.. అందరి ముందు కళ్యాణ్ కు అవమానం.. అనామికకు రాజ్ వార్నింగ్

ఆఫీస్ లో భర్త కళ్యాణ్ కవితల బండారం గురించి తెలుసుకున్న అనామిక తట్టుకోలేకపోతుంది. అందరి ముందు కళ్యాణ్ ను అవమానిస్తుంది. ఈ విషయంలో కావ్య.. కళ్యాణ్ కు సపోర్ట్ చేయడంతో మరింత రెచ్చిపోతుంది అనామిక . ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: అనామిక నిజస్వరూపం బయట పడింది.. అందరి ముందు కళ్యాణ్ కు అవమానం.. అనామికకు రాజ్ వార్నింగ్

Brahmamudi Serial Today Episode: భార్య పై ఈగోతో.. కావ్య (Kavya) వేసిన డిజైన్స్ నచ్చలేదని చెప్తాడు రాజ్. ఇలాంటి డిజైన్స్ ఏ వెదవకైనా నచ్చుతాయా..? అంటూ కావ్యను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఇక్కడ ఒక టెంపరరీ ఎంప్లాయి మాత్రమే అని కావ్యను ఎగతాళి చేస్తాడ. దీంతో భర్తకు కౌంటర్ ఇవ్వాలని భావించిన కావ్య.. ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు.. మా బావ మానేయమని చెప్తే ఇప్పుడే మానేస్తాను. మా బావ ఏం చెబితే అది చేస్తాను అంటూ రాజ్ కుళ్ళుకునేలా మాట్లాడుతుంది. విసిగిపోయిన రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

publive-image

కావ్య వేసిన డిజైన్స్ బాగాలేవని ఫీల్ అవుతున్న రాజ్.. క్లైంట్స్ కు ఏం సమాధానం చెప్పాలని టెన్షన్ పడతాడు. ఇంతలో ఆఫీస్ కు వచ్చిన క్లైంట్స్ కావ్య వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయని చెప్పడంతో రాజ్ (Raj) షాక్ అవుతాడు. దీంతో కావ్య రాజ్ ముందు రెచ్చిపోతుంది. నేను వేసిన డిజైన్స్ ఏ వెదవకు నచ్చవని చెప్పారు కదా అంటూ భర్త పై కౌంటర్లు వేస్తుంది.

publive-image
మరో వైపు భర్త కళ్యాణ్ (Kalyan) ఆఫీస్ లో ఏం చేస్తున్నాడని తెలుసుకోవడానికి వచ్చిన అనామిక.. కళ్యాణ్ కవితల బాగోతం చూసి కోపంతో రగిలిపోతుంది. అందరి ముందు భర్తను అవమానిస్తుంది. ఇది చూసిన రాజ్.. ఆఫీస్ లో పంచాయితీ ఏంటీ.. ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి అని అనామికను వార్నింగ్ ఇస్తాడు. కళ్యాణ్ పై కోపంతో రగిలిపోతున్న అనామిక.. ఇంటికి వచ్చాక నీ సంగతి తెలుస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Serial Today Episode
వాలెంటైన్స్ డే రోజు రాజ్ కావ్యకు ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అది సుభాష్ కు చూపిస్తాడు ప్రకాశం. ఈ వీడియో చూసి మురిసిపోయిన అన్నదమ్ములు.. తమ భార్యలకు కూడా లవ్ ప్రపోజ్ చేస్తారు.

publive-image

ఆఫీస్ లో భర్త నిర్వాకం తెలుసుకొని ఇంటికి వచ్చిన.. కళ్యాణ్ రాగానే కడిగిపారేయాలని కోపంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అత్త ధాన్యలక్ష్మీ ఏమైందని అడుగుతుంది. నీ కొడుకు ఆఫీస్ కు వెళ్లి కవి సమ్మేళనం మొదలు పెట్టాడని మాట్లాడుతుంది అనామిక. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi Serial Today Episode

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

Advertisment
Advertisment
తాజా కథనాలు