Brahmamudi Actor Appu: లవ్ ఫేల్యూర్స్ కు టిప్స్ చెప్పిన బ్రహ్మముడి నటి అప్పు బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ చెల్లి అప్పు కారెక్టర్ అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే, సీరియల్ లో లవ్ ఫేల్యూర్ అయిన అప్పు ఒక వీడియో రిలీజ్ చేస్తూ లవ్‌లో ఫేయిల్ అయిన అమ్మాయిలకు కొన్ని టిప్స్ చెబుతుంది. అలాంటి వారు స్ట్రాంగ్ గా ఉండాలని..ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పుకొచ్చింది. By Jyoshna Sappogula 04 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Appu Inspirational Video: బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ చెల్లి అప్పు కారెక్టర్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సీరియల్ లో అప్పు ప్రస్తుతం లవ్ ఫెయిల్యూర్. హీరో తమ్ముడు కళ్యాణ్ ను ప్రేమిస్తుంది అప్పు. అయితే, కళ్యాణ్ అనామిక అనే ఆమెను ప్రేమిస్తాడు. ఎన్నో గొడవల మధ్య వాళ్ల పెళ్లి జరుగుతుంది. కళ్యాణ్ ను మరచిపోవడానికి ఎప్పుడు ఏ పనులు చేయని అప్పు బిజీగా ఉంటూ తన బాధను కనపడకుండా నటిస్తు ఉంటుంది. Also read: ముకుందా మూరారి పెళ్లి ఏర్పాట్లు..కృష్ణ ఏం చేయనుంది? లవ్ ఫెయిల్యూర్స్ కు టిప్స్: సీరియల్ లో లవ్ ఫెయిల్యూర్ అయిన అప్పు ఒక వీడియోను రిలీజ్ చేసింది. లవ్‌లో ఫేయిల్ అయిన వారికి కొన్ని టిప్స్ చెబుతుంది. లవ్ ఫెయిల్యూర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెబుతుంది. ముందు ఇతరులను ఎక్కువగా ప్రేమించే కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలని అంటుంది. మనకు మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఎవరూ మనల్ని బ్రేక్ చేయలేరని చెబుతుంది. ఇలా చేస్తే బెటర్ ఫూచర్ ఉంటుంది.. అంతేకాదు, ప్రేమించిన వారి కోసం బాధపడేకన్నా ఫ్యామిలీ కోసం నిలబడాలని చెబుతుంది. ఫ్యామిలీకి గౌరవం ఇవ్వాలని అంటుంది. మనం ఏ స్టేజ్ నుంచి ఎదిగామో గుర్తు పెట్టుకోవాలని చెబుతుంది. ఫ్యామిలీతో ఎక్కువుగా టైం కేటియించాలని అంటుంది. మన లైఫ్ లో ఒక ఆప్షన్ పోతే ఇంకో అప్షన్ కచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. మన లైఫ్ లో ఇంకో బెటర్ అప్షన్ వస్తుందని.. అది కేవలం లవ్ అనే కాదు, కెరియర్, మంచి లైఫ్ అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా, కొన్ని టిప్స్ చెబుతూ అందరిని ఇన్స్పిరేషనల్ చేసింది ఈ అమ్మడు. Also read: కావ్యకు బిగ్ షాక్.. గర్ల్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన రాజ్.. ఆమె ఏం చేయనుంది.? ప్రస్తుతం సీరియల్ లో అయితే కళ్యాణ్ కోసం ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఈ బ్యూటీ. అభిమానులను తన నటనతో ఏడిపిస్తోంది. అయితే, అప్పు కారెక్టర్ పై ఫ్యాన్స్ అందరు తెగ ఫీల్ అవుతున్నారు. కళ్యాణ్ తో పెళ్లి జరిగింటే బాగుండు అని..అప్పును ఇలా ఏడుస్తూ ఉండడం చూడలేకపోతున్నామని అంటున్నారు. రానున్న రోజుల్లో అప్పు ఏం చేయనుంది? అప్పును కళ్యాణ్ పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తుందా? లేదా తన లైఫ్ లో ఎవరైనా కొత్త పర్సన్ వస్తాడా ? అనేది చూడాలి మరి. #brahmamudi-appu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి