Sunkishala Project: సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం.. మేఘా కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్న కేటీఆర్‌, ఏలేటి

సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్‌ కుప్పకూలడం సంచలనం రేపుతోంది. మేఘా కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు.

New Update
Sunkishala Project: సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం.. మేఘా కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్న కేటీఆర్‌, ఏలేటి

నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్‌ కుప్పకూలడం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2016లో ఈ ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ వైఫల్యమే కారణమని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరగడం వల్లే ప్రమాదానికి కారమని అధికారులు చెబుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని.. మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

సుంకిశాల ప్రాజెక్టు పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థను (పరోక్షంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ) బ్లాక్‌ లిస్టులో పెట్టాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, ముఖ్యమంత్రి రేవంత్ చేతగానితనం వల్లే ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోయిందని మండిపడ్డారు. హడావుడిగా పనులు చేయించడం వల్లే ఆ వాల్ కూలిందని పలువురు ఇంజినీర్లు తనతో చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో సుంకిశాల వద్దకి వెళ్లి పరిశీలిస్తామని.. అక్కడ ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అలాగే ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు ఈ ప్రమాదం బయటపడకుండా దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపం కోట్లాది రూపాయల ప్రజల సంపద నీట మునిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల క్రిమీ లేయర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..

ఈ ప్రాజెక్టు ప్రమాదంపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. ప్రమాదంపై రిపోర్టు అందిన తర్వాత.. కాంట్రాక్టు సంస్థపై (మేఘా ఇంజినీరింగ్ సంస్థ)పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కాంట్రాక్టు సంస్థదేనని వివరించారు. మరోవైపు మేఘా కృష్ణారెడ్డిపై ఎమ్మెల్యే, BJPLP నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. '' ప్రభుత్వం మారినా పెత్తనం మాత్రం మేఘా కృష్ణారెడ్డిదే. వారు చేపట్టే ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేసిన కూడా ఆయనకే పనులు అప్పగిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు నోటీసులు ఇచ్చింది నిజం కాదా. మేఘాను కాపాడేందుకే సుంకిశాల ప్రమాదం ఘటనను దాచారా ?.

మేఘా కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. ఈ కంపెనీ దొంగ గ్యారెంటీలు పెట్టిందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరమే లేఖ రాశారు. మేఘా అక్రమాలపై ఇంకా ఏం ఆధారాలు కావాలి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. రాష్ట్రం లేఖ ఇస్తే విచారణ చేయించే బాధ్యత నాది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కూడా మేఘా మీద రేవంత్ ఆరోపణలు చేశారు. ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి సిఫార్సు చేయడం లేదు. దాని మీద రిటైర్డు జడ్జి కమిటీ వేశారు. ఆ జడ్జికీ మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఆయనకి కీలకమైన ఫైల్స్ ఇవ్వడం లేదంట. కమిటీనీ ప్రభుత్వమే నీరు గార్చే పనిలో ఉంది.

Also Read: హిండెన్‌బర్గ్‌ నుంచి సంచలన ట్వీట్‌.. అదాని తర్వాత నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరు ?

ప్రభుత్వమే తన జేబులో ఉందని మేఘా కృష్ణారెడ్డి దర్జాగా ఉన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా నేను ఇచ్చే కమీషన్లకు లోగాల్సిందేననే ధీమాతో ఉన్నారు. అవినీతి విచారణ ఎదుర్కొంటున్న కంపెనీకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. కొడంగల్ పనులు కూడా మేఘాకి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని మా వద్ద సమాచారం ఉంది.
మేఘ కృష్ణ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలి. మేఘా మీద ఉన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలి. అరగంట ముందు ప్రమాదం జరిగి ఉంటే చాలా మంది ప్రాణాలు పోయేవి. జరిగిన ప్రమాదంపై విచారణ జరపాలి. బీఆర్ఎస్‌ - కాంగ్రెస్ మధ్య మేఘా కృష్ణ రెడ్డి సెటిల్మెంట్ చేస్తున్నారు. మేఘా అవినీతిపై సోమవారం మరొక్కసారి ఆధారాలతో ప్రెస్ మీట్ పెడతాను. ఆధారాలు ఎక్కడ సబ్మిట్ చేయమంటే అక్కడ సబ్మిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను
ప్రజల సొమ్మును దోచుకుంటున్న గజదొంగ సంస్థ మేఘా. దీనిపై చర్యలు తీసుకోకుంటే మేము ఆందోళన చేస్తాం. సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. లెటర్ ఇస్తే సీబీఐతో విచారణ చేయించే బాధ్యత నాదని'' ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు